T20 World Cup 2024 : పాకిస్తాన్ గోల్డెన్ ఛాన్స్‌ను దెబ్బ‌కొట్టిన బాబర్ ఆజం-మ‌హ్మ‌ద్ రిజ్వాన్

By Mahesh Rajamoni  |  First Published Jun 12, 2024, 1:11 AM IST

T20 World Cup, PAK vs CAN: పాకిస్తాన్ ఎట్టకేలకు టీ20 ప్రపంచ కప్ 2024లో విజ‌యాన్ని అందుకుంది. జూన్ 11న కెనడాపై పాకిస్థాన్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచి పరువు కాపాడుకుంది. అయితే, స్టార్ ప్లేయ‌ర్లు బాబార్ ఆజం-మ‌హ్మ‌ద్ రిజ్వాన్ పాక్ జ‌ట్టు గొల్డెన్ ఛాన్స్ ను దెబ్బ‌కొట్టారు.
 


T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన త‌ర్వాత పాకిస్తాన్ జట్టు ఎట్ట‌కేల‌కు విజ‌యాన్ని అందుకుంది. జూన్ 11న జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో కెనడాపై విజయం సాధించింది. అయితే ఈ విజయం పాకిస్థాన్‌కు సంబరాలు చేసుకునే అవకాశం ఇవ్వ‌లేదు. ఎందుకంటే ఇప్ప‌టికే సూప‌ర్ 8 అవ‌కాశాల‌ను క్లిష్టంగా మార్చుకుంది. అయితే, కెప్టెన్ బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ పాక్ ముందున్న మంచి గోల్డెన్ ఛాన్స్ ను దూరం చేశారు. వీరిద్ద‌రికి రన్ రేట్‌లో అమెరికాను అధిగమించడానికి గొప్ప అవకాశం ఉంది కానీ, దానిని సాధించ‌డంలో స‌ఫ‌లం కాలేక‌పోయారు. దీతో తాజాగా విజ‌యం సాధించిన‌ప్ప‌టీకీ సూపర్-8కి చేరుకోవాలన్న పాకిస్థాన్ ఆశలు మరింత తగ్గాయి.

కెనడాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ నుంచి అద్భుతమైన బౌలింగ్ కనిపించింది. కెనడాకు శుభారంభం లభించినా ఆ తర్వాత పేసర్లు ఉచ్చు బిగించారు. పేసర్లు అన్ని వికెట్లు తీశారు. మహ్మద్ అమీర్, హరీస్ రవూఫ్ రెండేసి వికెట్లు తీయ‌గా, నసీమ్ షా, షాహీన్ అఫ్రిదిల‌కు చెరో వికెట్ ద‌క్కింది. పాక్ అద్భుతమైన బౌలింగ్ తో కెనడా జట్టు 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 106 పరుగులకే పరిమితమైంది.

Latest Videos

undefined

ఆరోన్ జాన్సన్ వన్ మ్యాన్ షో

కెన‌డా ప్లేయ‌ర్ల‌లో ఆరోన్ జాన్సన్ ఒక్కడే పాక్ బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. ఒక వైపు నుండి, కెనడియన్ జట్టు వ‌రుస‌గా వికెట్లు కోల్పోతున్నా.. ఆరోన్ జాన్సన్ పాక్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొన్నాడు. జాన్సన్ 44 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్లతో 52 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ కారణంగానే కెనడా జట్టు 100 పరుగుల మార్కును అందుకుంది.

పాకిస్థాన్ అవ‌కాశాల‌పై దెబ్బ‌..

107 పరుగుల లక్ష్యాన్ని చేధించిన పాక్ జట్టుకు రన్ రేట్ పెంచే గొప్ప అవకాశం వచ్చింది. బాబర్ ఆజం జట్టు 14 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి ఉంటే, రన్ రేట్‌లో అమెరికాను అధిగమించి ఉండేది. అయితే 3 మ్యాచ్‌లు ఆడినప్పటికీ రన్ రేట్‌లో పాకిస్థాన్ అమెరికా కంటే వెనుకబడి ఉంది. సూపర్-8కి చేరుకోవాలంటే పాకిస్థాన్ తదుపరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవాలి. అమెరికా విజ‌యం సాధిస్తే పాక్ ఆశ‌లు గ‌ల్లంతు అయిన‌ట్టే. రెండు మ్యాచ్‌ల్లోనూ అమెరికా ఓడిపోయినా.. సూపర్‌-8కి చేరుకోవడానికి పాకిస్థాన్ జట్టు కష్టపడాల్సి వస్తుంది. బాబర్, రిజ్వాన్ స్వయంగా వచ్చిన అవ‌కాశాన్ని జార‌విడిచారు. 9 వికెట్లు ఇంకా పాక్ చేతిలో ఉన్న‌ప్ప‌టీకీ ఇద్దరూ జిడ్డుగా బ్యాటింగ్ చేశారు. రిజ్వాన్ 53 బంతుల్లో 53 పరుగులు చేయగా, బాబర్ 33 బంతుల్లో 33 పరుగులు చేశాడు.

T20 WORLD CUP: అమెరికాలో టీమిండియా ప్రకంపనలు.. రికార్డులు బద్దలయ్యాయి..

click me!