T20 worldcup:ఇదీ కోహ్లీ అంటే.. స్కాట్లాండ్ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి మరీ..!

By telugu news teamFirst Published Nov 6, 2021, 12:51 PM IST
Highlights

స్కాట్లాండ్‌పై 19 బంతుల్లో 50 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ కొంతమంది స్కాట్లాండ్ ఆటగాళ్లతో మాట్లాడుతూ.. అత్యుత్తమ ఆటగాళ్లకు వ్యతిరేకంగా ఉన్నత స్థాయిలో ఎలా ఆడాలో వారితో పంచుకున్నారు
 

T20 worldcup లో టీమిండియా పాయింట్ల పట్టిక ముందుకు కదిలింది. వరసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయినా.. తర్వాతి రెండు మ్యాచ్ ల్లోనూ సత్తాచాటింది. కాగా.. స్కాట్లాండ్ ని చిత్తు గా ఓడించిన తర్వాత.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. క్రీడా స్ఫూర్తి తెలియజేశాడు. 

మ్యాచ్ ముగిసిన వెంటనే.. తమ జట్టుతో కలిసి.. కెప్టెన్ విరాట్ కోహ్లీ స్కాట్లాండ్ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి.. వారితో కలిసి మాట్లాడారు. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజాలు బంతితో దడపుట్టించిన తరువాత కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ను ఓడించింది.

Also Read: T20 World Cup: 39 బంతుల్లోనే లక్ష్యాన్ని చేధించిన భారత్.. నెట్ రన్‌రేట్ మాములుగా పెరగలేదుగా..

స్కాట్లాండ్‌పై 19 బంతుల్లో 50 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ కొంతమంది స్కాట్లాండ్ ఆటగాళ్లతో మాట్లాడుతూ.. అత్యుత్తమ ఆటగాళ్లకు వ్యతిరేకంగా ఉన్నత స్థాయిలో ఎలా ఆడాలో వారితో పంచుకున్నారు

Huge respect to and co. for taking the time 🤜🤛 pic.twitter.com/kdFygnQcqj

— Cricket Scotland (@CricketScotland)

 

క్రికెట్ స్కాట్లాండ్ మాత్రమే కాదు, భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో స్కాట్లాండ్ జట్టును కలిసిన ఫోటోలను క్రికెట్ స్కాట్లాండ్ సోషల్ మీడియాలో పంచుకుంది. “సమయం వెచ్చించినందుకు కోహ్లీసేనకు ధన్యవాదాలు. మాకిది ఇంది ఎంతో గౌరవం” అంటూ క్యాప్షన్ అందించారు. కాగా.. కోహ్లీ చేసిన పనికి క్రికెట్ అభిమానులు మొత్తం ఫిదా అయిపోయారు.

Also read:తమ రిలేషన్ ని కన్ఫామ్ చేసిన కేఎల్ రాహుల్, అతియా శెట్టి..!

86 పరుగుల ఛేజింగ్‌లో టీమిండియా ఓపెనర్లు టీ30 ప్రపంచ కప్‌లోనే ఫాస్టెస్ట్ టీమ్ ఫిఫ్టీని నమోదు చేసి, రికార్డులు నెలకొల్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ నెట్ రన్ రేట్‌ను మెరుగుపరచడానికి భారతదేశం 7.1 ఓవర్లలో 86 పరుగులను ఛేదించాల్సి ఉంది. కానీ, కోహ్లీ నేతృత్వంలోని జట్టు 6.3 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. “మేం ప్రారంభానికి ముందు 8-10 ఓవర్ల బ్రాకెట్ గురించే మాట్లాడుకున్నాం. ఈ సమయంలో వికెట్లు కోల్పోతే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే వికెట్లు కోల్పోతే 20 బంతులు అదనంగా ఖర్చవుతాయి. రోహిత్, రాహుల్ సహజంగా ఆడితే త్వరగా పరుగులు వస్తాయని మేం భావించాం” అని విజయం తర్వాత కోహ్లీ వెల్లడించాడు

click me!