టీ20 వరల్డ్‌కప్ 2021: నువ్వు ఎవరు, ఏం చేస్తుంటావో చెప్పు... షోయబ్ అక్తర్‌కి హర్భజన్ ఘాటు రిప్లై..

Published : Oct 17, 2021, 09:18 PM ISTUpdated : Oct 17, 2021, 09:34 PM IST
టీ20 వరల్డ్‌కప్ 2021: నువ్వు ఎవరు, ఏం చేస్తుంటావో చెప్పు... షోయబ్ అక్తర్‌కి హర్భజన్ ఘాటు రిప్లై..

సారాంశం

హర్భజన్ సింగ్, తనకన్ని విషయాలు తెలుసనుకుంటాడంటూ అక్తర్ ట్వీట్... నువ్వు ఎవరో మాత్రం తెలియదంటూ ఘాటు రిప్లై ఇచ్చిన హర్భజన్ సింగ్... టీ20 వరల్డ్‌కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కి ముందు...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఘనంగా ఆరంభమైంది. క్వాలిఫైయర్స్ ముగిసిన తర్వాత భారత జట్టు, దాయాది పాకిస్తాన్‌తోనే తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌పై ఇప్పటికే కావాల్సినంత హైప్ వచ్చేసింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటికే భారత జట్టు చేతుల్లో ఐదుసార్లు ఓడింది పాకిస్తాన్. అయితే ఈసారి భారత్‌ను తప్పకుండా ఓడించి, తీరతామని ధీమా వ్యక్తం చేస్తోంది పాకిస్తాన్...

ఇదిలా ఉంచితే తాజాగా టీ20 వరల్డ్ కప్ ఆరంభ వేడుకల్లో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్, భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాల్గొన్నారు. ఈ ఇద్దరి మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. అక్కడితో చర్చను వదిలివేయడం ఇష్టం లేని షోయబ్ అక్తర్, ఆ చర్చను సోషల్ మీడియా వేదికకు మార్చాడు.

‘విత్  నాకన్నీ తెలుసనుకునే మిస్టర్ హర్భజన్ సింగ్‌తో దుబాయ్‌లో భారత్, పాక్ మ్యాచు గురించి ప్రీ డిస్కర్షన్...’ అంటూ ఓ ట్వీట్ చేశాడు షోయబ్ అక్తర్. దీనికి స్పందించిన హర్భజన్ సింగ్.. ‘నాకు ఓ విషయం మాత్రం తెలీదు, ఇంతకీ నువ్వు ఎవరు? ఏం చేస్తుంటావో మాకు కొంచెం చెప్పు...’ అంటూ కామెంట్ చేశాడు...

ట్రోల్ చేయాలని చూసిన షోయబ్ అక్తర్, తనదైన పంచ్‌తో నోరు మూయించాడు హర్భజన్ సింగ్. అయితే ఈ ఇద్దరి ట్వీట్ల కింద భారత, పాక్ అభిమానుల మధ్య హాట్ హాట్ డిస్కర్షన్ జరుగుతోంది... అక్టోబర్ 24న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లన్నీ బుకింగ్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి...

must read: అతనిలో మాహీ భాయ్ కనిపిస్తున్నాడు, వచ్చే ఏడాది కలిసి ఆడతామో లేదో... సురేష్ రైనా కామెంట్స్...

 వీడిన సస్పెన్స్, టీమిండియా తర్వాతి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్... 2023 వన్డే వరల్డ్‌కప్ వరకూ...

 IPL2021 Final: తన Ex- టీమ్‌పై కసి చూపించిన ఊతప్ప... అప్పుడు కేకేఆర్ తరుపున ఆడి, ఇప్పుడు సీఎస్‌కేకి...

IPL 2021 Final: ఆ బాల్‌కి సిక్స్ వచ్చుంటే బాగుండు... కెఎల్ రాహుల్, రుతురాజ్‌కీ ఎంత తేడా... IPL Final: ధోనీ క్యాచ్ డ్రాప్.. కేబుల్‌కి బాల్ తగలడంలో క్యాచ్ పట్టినా గిల్ నాటౌట్...

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?