Latest Videos

IPL 2024 ఫైనల్లో సన్‌రైజర్స్ ఓటమి.. ఏడ్చేసిన కావ్య మార‌న్.. వీడియో

By Mahesh RajamoniFirst Published May 27, 2024, 12:33 AM IST
Highlights

IPL 2024 Kavya Maran : ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమిని చవిచూసింది. తన టీమ్ ఓటమి తర్వాత కావ్య మారన్ ఏడుస్తూ కన్నీరు పెట్టుకున్నారు.
 

IPL 2024 Final Kavya Maran : ఐపీఎల్ 2024 ఫైనల్ పోరులో ఆల్ రౌండ్ ప్రదర్శనతో కోల్ కతా నైట్ రైడర్స్ ఛాంపియ‌న్ గా నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ పై సూపర్ విక్టరీతో ఐపీఎల్ 2024 టైటిల్ ను అందుకుంది. 10 సంవ‌త్స‌రాల నిరీక్ష‌న‌కు తెర‌దించుతూ కేకేఆర్ మూడో సారి ఐపీఎల్ టైటిట్ సాధించింది. అంత‌కుముందు గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014లో కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. 

అయితే, లీగ్ ద‌శ‌లో దుమ్మురేపే బ్యాటింగ్, బౌలింగ్ తో అద‌ర‌గొట్టిన హైద‌రాబాద్ టీమ్ ఫైన‌ల్లో చెత్త ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ఐపీఎల్ 2024 ఫైన‌ల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు రాణించ‌లేక‌పోయారు. అభిషేక్ శర్మ 2, ట్రావిస్ హెడ్ 0, రాహుల్ త్రిపాఠి 9 పరుగులతో ఔటయ్యారు. వారి తర్వాత నితీష్ కుమార్ రెడ్డి 13, ఐడెన్ మార్క్రామ్ 20, హెన్రిచ్ క్లాసెన్ 16, షాబాజ్ అహ్మద్ 8, అబ్దుల్ సమద్ 4, జయదేవ్ ఉనద్క‌డ్ 4 ప‌రుగులకే ఔట్ అయ్యారు. చివరలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 24 పరుగులు చేయ‌డంలో హైద‌రాబాద్ 113 పరుగులకు చేరుకుంది. 

గౌతమ్ గంభీర్ ను ముద్దు పెట్టుకున్న షారుఖ్ ఖాన్.. వీడియో

కేకేఆర్ బౌల‌ర్ల‌లో ఆండ్రీ రస్సెల్ 3, మిచెల్ స్టార్క్ 2, హర్షిత్ రాణా 2 వికెట్లు తీసుకున్నారు. అలాగే, వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు. 114 ఈజీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన కేకేఆర్ 2 వికెట్లు కోల్పోయి 10.2 ఓవ‌ర్ల‌లో లక్ష్యాన్ని అందుకుంది. ఎస్ఆర్హెచ్ పై 8 వికెట్ల తేడాతో గెలిచి 3వ సారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. అయితే, ఫైన‌ల్ పోరు ముందు వ‌ర‌కు అద‌ర‌గొట్టిన త‌న జ‌ట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట తీరుతో కావ్య మార‌న్ తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. ఈ మ్యాచ్ లో అత్యంత దారుణంగా ఆడి 8 వికెట్ల తేడాతో ఓడిపోయి త‌ర్వాత ఓనర్ కావ్య మారన్ కంటతడి పెట్టుకుంది. కావ్య మార‌న్ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

 

A season to be proud of 🧡 pic.twitter.com/rmgo2nU2JM

— JioCinema (@JioCinema)

 

IPL 2024 Final : హైదరాబాద్ హీరోలు జీరోలయ్యారు మామా.. ఫైనల్లో ఇదెక్కడి ఆట సామి.. !

click me!