Latest Videos

గౌతమ్ గంభీర్ ను ముద్దు పెట్టుకున్న షారుఖ్ ఖాన్.. వీడియో

By Mahesh RajamoniFirst Published May 27, 2024, 12:02 AM IST
Highlights

KKR as IPL 2024 champion : ఐపీఎల్ 2024 ఛాంపియ‌న్ గా కోల్‌కతా నైట్ రైడర్స్ నిలిచింది. హైద‌రాబాద్ తో జ‌రిగిన ఫైన‌ల్ పోరులో ఆల్ రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. కేకేఆర్ విన్నింగ్ త‌ర్వాత గౌత‌మ్ గంభీర్ ను షారుఖ్ ఖాన్ కిస్ చేసిన వీడియో వైర‌ల్ గా మారింది.
 

IPL 2024 Final : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2025 (ఐపీఎల్ 2024) ఛాంపియ‌న్ గా కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ నిలిచింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా  ఓడించి మూడో ఐపీఎల్ టైటిల్ ను ఎగురేసుకు పోయింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ టీమ్ 113 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. కేకేఆర్ 2 వికెట్లు కోల్పోయి 10.3 ఓవ‌ర్ల‌లో టార్గెట్ ను అందుకుని ఛాంపియ‌న్ గా నిలిచింది.

10 సంవ‌త్స‌రాల నిరీక్ష‌న‌కు తెర‌దించుతూ కేకేఆర్ ఐపీఎల్ టైటిట్ ను మ‌రోసారి సాధించ‌డంతో కోల్‌కతా నైట్ రైడర్స్ సహ-యజమాని షారుఖ్ ఖాన్ చాలా సంతోషంతో ఉప్పొంగిపోయాడు. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టు 8 వికెట్ల తేడాతో పాట్ కమ్మిన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ని ఓడించి 3వ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. అంత‌కుముందు గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014లో కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ ను సాధించింది. మూడవ సారి ట్రోఫీని అందించ‌డానికి మ‌రోసారి గంభీర్ కేకేఆర్ మెంటార్‌గా జ‌ట్టులోకి తిరిగివ‌చ్చాడు.

IPL 2024 Prize Money: ఐపీఎల్ 2024 విజేత‌కు ప్రైజ్ మ‌నీ ఎంత‌? ర‌న్న‌ర‌ప్ ఎంత అందుకుంటారు?

గంభీర్ పునరాగమనం ఈ ఏడాది కేకేఆర్ కు అద్భుతాలు చేసింది. 9 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో లీగ్ దశను కేకేఆర్ ముగించింది. క్వాలిఫైయర్ 1, ఫైనల్‌లో హైరాబాద్ ను దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఐపీఎల్ 2024 ఫైనల్‌లో గెలిచిన తర్వాత కేకేఆర్ టీమ్స్, ఇత‌ర సిబ్బంది చాలా సంతోషంగా క‌నిపించారు.

ఈ క్ర‌మంలోనే షారూఖ్ ఖాన్ తన ఆటగాళ్లను అద్భుతమైన విజయంతో అభినందించడానికి గ్రౌండ్ లోకి వ‌చ్చారు. ఈ క్రమంలోనే కోల్‌కతా నైట్ రైడర్స్ సభ్యులను కౌగిలించుకుంటూ త‌న‌దైన త‌ర‌హాలో ప్రేమను, గౌర‌వాన్ని కురిపించాడు. ఇక గంభీర్ ను కౌగిలించుకోవ‌డంతో పాటు నుదిటిపై ముద్దుపెట్టాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

 

Shah Rukh Khan kissed Gautam Gambhir's forehead. 💜 pic.twitter.com/GGEpuijOUw

— 𝐀𝐳𝐚𝐝 (@Azad_jawan)

 

భార్య న‌టాషాతో విడాకుల వార్తల మధ్య హార్దిక్ పాండ్యా వీడియో వైర‌ల్

click me!