SA20 2024: సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20)లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. డర్భన్ సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ కళ్లుచెదిరిపోయేలా గాల్లోకి ఎగిరిపట్టుకున్న క్యాచ్ మ్యాచ్ లో హైలెట్ గా నిలిచింది.
Sunrisers captain Aiden Markram's eye-popping catch: రసవత్తరంగా సారిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్ చివరిదశకు చేరుకుంది. ఢిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఈ సీజన్ లో కూడా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. మరోసారి ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో క్వాలిఫైయర్ 1లో డర్బన్ సూపర్ జెయింట్‌ను ఓడించిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు ఇది గుర్తుండిపోయే రోజు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ 56 పరుగుల తేడాతో సునాయాసంగా గెలిచి పోటీలో ముందుకు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ 157/8 పరుగులు చేయగా ఛేజింగ్ లో డర్బన్ సూపర్ జెయింట్స్ 106 పరుగులకు కుప్పకూలింది. బార్ట్ మన్చ జాన్సన్ లు అద్బుతమైన బౌలింగ్ తో చెరో 4 వికెట్లు తీసుకున్నారు.
అయితే, ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ కెప్టెన్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. సన్ రైజర్స్ కెప్టెన్ ఎడెన్ మర్క్‌రమ్ కళ్లుచెదిరిపోయేలా గాల్లోకి ఎగిరిపట్టుకున్న క్యాచ్ మ్యాచ్ లో హైలెట్ గా నిలిచింది. అద్భుతమైన ఫీల్డర్ అయిన ఎడెన్ మర్క్‌రమ్, మిడ్-ఆన్‌లో బ్యాటర్ స్మట్స్ పుల్ షాట్‌ను ఆడగా, ఎడెన్ మర్క్‌రమ్ గాల్లోకి ఎగిరి ఒంటిచెత్తో ఒడిసిపట్టుకున్నాడు. నిజంగా కళ్లు చెదిరిపోయే సూపర్ క్యాచ్.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
WI vs AUS: ఇదేం వన్డే గురూ.. 6.5 ఓవర్లలోనే మ్యాచ్ ముగించారు.. !
Sunrisers captain Aiden Markram's eye-popping catch pic.twitter.com/CZq5X78XfM
— mahe (@mahe950)Sachin Arjun Tendulkar: తండ్రి సూపర్ హిట్.. కొడుకు అట్టర్ ఫ్లాప్ !