ICC Under 19 World Cup 2024 : సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. ఫైనల్‌లో అడుగుపెట్టిన యువ భారత్

By Siva Kodati  |  First Published Feb 6, 2024, 9:43 PM IST

అండర్ 19 ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత జట్టు అడుగుపెట్టింది. సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో యువ భారత్ 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నెల 8న పాకిస్తాన్, ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న రెండో సెమీస్‌లో గెలిచిన జట్టుతో టీమిండియా ఫైనల్‌లో తలపడనుంది. 
 


అండర్ 19 ప్రపంచకప్‌లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తాజాగా సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో యువ భారత్ 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. సఫారీలు నిర్ధేశించిన 245 పరుగుల లక్ష్యాన్ని భారత్ 48.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ ఉదయ్ సహరన్ 81, సచిన్ దాస్ 96 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్వెనా మఫాకా, ట్రిస్టాన్ లూస్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఈ నెల 8న పాకిస్తాన్, ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న రెండో సెమీస్‌లో గెలిచిన జట్టుతో టీమిండియా ఫైనల్‌లో తలపడనుంది. 

తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీతయ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. సఫారీ బ్యాట్స్‌మెన్‌లలో 76, రిచర్డ్ సెలెట్స్‌వేన్ (64) చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3, ముషీర్ ఖాన్ 2,  నమన్ తివారీ, సౌమీ పాండే చెరో వికెట్ పడగొట్టారు. అండర్ 19 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా ఐదోసారి ఫైనల్‌కు చేరింది. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఇప్పటి వరకు 9 సార్లు ఫైనల్స్‌కు చేరుకోగా.. ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచింది. 

Latest Videos

click me!