Sri Lanka vs Afghanistan: శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 మ్యాచ్ లో వనిందు హసరంగ 67, సదీర సమరవిక్రమ 25 పరుగులతో రాణించడంతో శ్రీలంక విజయం సాధించింది.
Sri Lanka vs Afghanistan : 1 టెస్టు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ఆడేందుకు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. శ్రీలంక టెస్టు సిరీస్‌ను 1-0తో, వన్డే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ నడుస్తోంది. ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంక జట్టు 19 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 160 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక తరఫున వనిందు హసరంగ 67 పరుగులు చేశాడు. అఫ్గానిస్థాన్ తరఫున ఫరూఖీ 3, నవీన్ ఉల్ హక్, ఒమర్‌జాయ్ చెరో 2 వికెట్లు తీశారు.
IND VS ENG: ఇది ఇండియన్ బాల్ గురూ.. ఒకవైపు జైస్వాల్.. మరోవైపు పుజారా.. సెంచరీల మోత !
ఆ తర్వాత 161 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేసింది. అఫ్గానిస్థాన్ జట్టులో అద్భుతంగా ఆడిన కెప్టెన్ ఇబ్రహీం షడ్రాన్ 67 పరుగులు చేశాడు కానీ, జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. విజయానికి చివరి ఓవర్‌లో 11 పరుగులు కావాలి. కానీ అఫ్గానిస్థాన్ జట్టు కేవలం 6 పరుగులు మాత్రమే జోడించి.. తద్వారా శ్రీలంక జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక తరఫున మదిషా పతిరనా 4 వికెట్లు పడగొట్టాడు.
ఒక్కడు, పోకిరి, దూకుడు ఇవేమీ కాదు..కృష్ణకి అత్యంత ఇష్టమైన మహేష్ మూవీ అదే, ఎందుకో తెలుసా