
India vs England: రాజ్ కోట్ వేదిగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో భారత జట్టు ఆటగాళ్లు చేతులకు నల్ల బ్యాండ్లు (బ్యాడ్జీలు) కట్టుకుని శనివారం మైదానంలోకి వచ్చారు. మూడో రోజు మ్యాచ్ పూర్తి అయ్యే వరకు అలాగే, వాటిని ధరించి ఆట ఆడారు. టీమిండియా మాజీ ప్లేయర్ కు నివాళిగా భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్ లో ఇలా నల్ల బ్యాడ్జీలు ధరించారు. టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ స్మారకార్థం భారత ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్‌లు ధరించారని బీసీసీఐ తెలిపింది.
ఎవరీ దత్తాజీరావు గైక్వాడ్?
టీమిండియా మాజీ కెప్టెన్ 95 ఏళ్ల దత్తాజీరావు గైక్వాడ్ ఇటీవల మరణించారు. అన్షుమాన్ గైక్వాడ్ తండ్రి దత్తాజీరావు 1952-1961 మధ్య 11 టెస్టుల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నారు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ దత్తాజీరావు 18.42 సగటుతో 350 పరుగులు చేశాడు. దత్తాజీరావు గైక్వాడ్ తన అద్భుతమైన డిఫెన్స్, డ్రైవింగ్‌కు పేరుగాంచాడు. అలాగే, అద్భుతమైన ఫీల్డర్‌గా కూడా గుర్తింపు సాధించారు. గైక్వాడ్ 1952లో విజయ్ హజారే కెప్టెన్సీలో అరంగేట్రం చేశాడు. స్వాతంత్య్రానంతరం ఇంగ్లాండ్ లో భారత్ చేస్తున్న తొలి పర్యటన ఇదే.
INDIA VS ENGLAND: ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికిపారేసిన యశస్వి జైస్వాల్.. రాజ్‌కోట్‌లో సెంచరీ !
దత్తాజీరావు గైక్వాడ్ తన కెరీర్‌ను ఓపెనర్‌గా ప్రారంభించాడు, కానీ అతను మిడిల్ ఆర్డర్‌లో స్థిరపడ్డాడు. అతను తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 1961లో పాకిస్తాన్‌తో చెన్నైలో ఆడాడు. రంజీ ట్రోఫీలో బరోడాకు గైక్వాడ్ సేవలు అందించారు. 1947 నుండి 1961 వరకు బరోడాకు ప్రాతినిధ్యం వహించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో గైక్వాడ్ 17 సెంచరీల సాయంతో 5788 పరుగులు చేశాడు. దత్తాజీరావు గైక్వాడ్ నాయకత్వంలో బరోడా 1957-58 రంజీ ట్రోఫీ సీజన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆపై బరోడా ఫైనల్‌లో సర్వీసెస్‌ను ఓడించింది. 2016లో 87 ఏళ్ల వయసులో దీపక్ శోధన్ మరణించిన తర్వాత, దత్తాజీరావు గైక్వాడ్ దేశంలోని అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్‌గా నిలిచారు. బరోడాలోని తన నివాసంలో గైక్వాడ్ తుది శ్వాస విడిచారు. గైక్వాడ్ మొదట్లో బాంబే యూనివర్శిటీ తరపున క్రికెట్ ఆడాడు, ఆ తర్వాత బరోడాలోని మహారాజా సాయాజీ యూనివర్సిటీ తరఫున ఆడటం ప్రారంభించారు.
IPL 2024 - CSK : ధోని తో జోడీ కట్టిన కత్రినా కైఫ్.. !