T20 World Cup Super 8 Schedule: టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8 షెడ్యూల్ ను ఐసీసీ ప్రకటించింది. గ్రూప్ ఏ నుంచి భారత్, యూఎస్ఏ జట్లు సూపర్-8కు అర్హత సాధించాయి. పాకిస్తాన్, న్యూజిలాండ్ శ్రీలంకలు ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యాయి.
T20 World Cup 2024 Super 8 Schedule : టీ20 ప్రపంచ కప్ 2024 రసవత్తరంగా ముందుకు సాగుతోంది. బౌలర్ల పైచేయి నడుస్తున్న ఈ ప్రపంచ కప్ లో ఇప్పటికే అనేక సంచలనాలు నమోదయ్యాయి. బలమైన జట్లుగా గుర్తింపు ఉన్న టీమ్స్ కూడా ఊహించని విధంగా సూపర్-8 చేరకుండానే ఎలిమినేట్ అయ్యాయి. సూపర్-8 చేరిన జట్లలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. మరో రెండు రోజుల్లో దాదాపుగా సూపర్-8 జట్లన్నీ వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలోనే సూపర్-8కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. సూపర్-8లో 8 జట్లను 4 టీమ్స్ తో రెండు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్-1లోని టీమిండియా మ్యాచ్ లు ఎప్పుడు?
undefined
సూపర్-8లో మొత్తం రెండు గ్రూపులు ఉండగా, గ్రూప్-1కి మూడు జట్లు వచ్చాయి. ఇందులో భారత జట్టుతో పాటు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ లు ఉన్నాయి. గ్రూప్-2లో అతిథ్య దేశాలైన వెస్టిండీస్, అమెరికాలతో పాటు దక్షిణాఫ్రికా కూడా అర్హత సాధించింది. గ్రూప్-1లో మిగిలిన స్థానాల కోసం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరికి సూపర్-8 టిక్కెట్ లభిస్తుంది. గ్రూప్-2లో మిగిలిన ఒక స్థానం కోసం స్కాట్లాండ్, ఇంగ్లండ్ జట్లు పోటీ పడుతున్నాయి.
జూన్ 19 నుంచి సూపర్-8 మ్యాచ్ లు
జూన్ 19 నుంచి సూపర్-8 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. జూన్ 20న అఫ్గానిస్థాన్‌తో సూపర్-8లో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. భారత జట్టు తదుపరి మ్యాచ్ జూన్ 22న ఆడనుంది. ఈ మ్యాచ్ బంగ్లాదేశ్ లేదా దక్షిణాఫ్రికాతో జరగవచ్చు. దీని తర్వాత జూన్ 24న రోహిత్ శర్మ సేన ఆస్ట్రేలియాతో తలపడనుంది.
టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్-8 పూర్తి షెడ్యూల్ ఇదే..
19 జూన్: A2 vs దక్షిణాఫ్రికా (నార్త్ సౌండ్, ఆంటిగ్వా)
19 జూన్: B1 vs వెస్టిండీస్ (గ్రాస్ ఐలెట్, సెయింట్ లూసియా)
20 జూన్: ఆఫ్ఘనిస్తాన్ vs ఇండియా (బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్)
20 జూన్: ఆస్ట్రేలియా vs D2 (నార్త్ సౌండ్, ఆంటిగ్వా)
21 జూన్: B1 vs దక్షిణాఫ్రికా (గ్రాస్ ఐలెట్, సెయింట్ లూసియా)
21జూన్ : A2 vs వెస్టిండీస్ (బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్)
22 జూన్ : ఇండియా vs D2 (నార్త్ సౌండ్, ఆంటిగ్వా జూన్)
22: ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా (ఆర్నోస్ వేల్, సెయింట్ విన్సెంట్)
జూన్ 23: A2 vs B1 (బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్)
జూన్ 23: వెస్టిండీస్ vs దక్షిణాఫ్రికా (నార్త్ సౌండ్, ఆంటిగ్వా)
జూన్ 24: ఆస్ట్రేలియా vs ఇండియా (గ్రాస్ ఐలెట్, సెయింట్ లూసియా)
జూన్ 24: ఆఫ్ఘనిస్తాన్ vs D2 (అర్నోస్ వేల్, సెయింట్ విన్సెంట్)
0 పరుగులు...0 వికెట్లు.. 0 క్యాచ్‌లు.. టీ20 ప్రపంచ కప్ భారత జట్టులోని ఈ ప్లేయర్ ఎవరో తెలుసా?