Shubman Gill: విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ పై శుభ్‌మన్ గిల్ సెంచరీ (105 పరుగులు)తో అదరగొట్టాడు. దీంతో 24 ఏళ్ల వయసులో 10 సెంచరీలు చేసిన యువ రైట్‌హ్యాండర్‌గా ఘనత సాధించడంతో పాటు భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల సరసన చేరాడు.
India vs England: టీ20, వన్డే క్రికెట్ లో అద్భుతమైన ఆటతో ముందుకు సాగుతున్న శుభ్‌మన్ గిల్ టెస్టు క్రికెట్ లో మాత్రం ఘోరంగా విఫలమవుతూ వచ్చాడు. టెస్టు క్రికెట్‌లో వరుసగా 12 ఇన్నింగ్స్‌లు ఆడి పెద్దగా పరుగులు చేయకుండా పెవిలియన్ కు చేరుతూ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే గిల్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, తన బ్యాట్ పదునుతో విమర్శకుల నోళ్లను మూయించాడు. వైజాగ్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు. చాలా కాలం తర్వాత సెంచరీని సాధించడంతో పాటు 24 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ లో 10 సెంచరీల చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.
దీంతో టీమిండియా యువ రైట్ హ్యాండర్ శుభ్‌మాన్ గిల్ భారత క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలతో కూడిన ఎలైట్ గ్రూప్‌లో చేరాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల వయసులో 30 సెంచరీలు చేసి రికార్డు సృష్టించగా, క్లాస్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (21), యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (10) తర్వాతి స్థానాల్లో నిలిచారు. సచిన్ టెండూల్కర్ 273 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధిస్తే, విరాట్ కోహ్లీ 163, శుభ్‌మన్ గిల్ 99 ఇన్నింగ్స్‌ల్లో 10 సెంచరీలు సాధించారు. రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్‌లు 9 సెంచరీలతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు.
జట్టుకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీకి బిగ్ షాక్ ! కేన్ మామ దూకుడు !
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో శుభ్‌మాన్ గిల్ ఇప్పటివరకు రెండు సెంచరీలు సాధించాడు. దీంతో టీమిండియా తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 5 సెంచరీలతో రోహిత్ శర్మ టాప్ లో ఉండగా, విరాట్ కోహ్లీ 3 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే, 2017 తర్వాత విశాఖ స్టేడియంలో టీమిండియా తరఫున సెంచరీ సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా గిల్ నిలిచాడు.
కింగ్ కోహ్లీ, డాన్ బ్రాడ్‌మన్ లను వెనక్కినెట్టిన కేన్ విలియమ్సన్