కింగ్ కోహ్లీ, డాన్ బ్రాడ్‌మన్ ల‌ను వెన‌క్కినెట్టిన కేన్ విలియమ్సన్

By Mahesh Rajamoni  |  First Published Feb 5, 2024, 9:50 AM IST

NZ vs SA: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 30వ టెస్టు సెంచరీని నమోదు చేశాడు. తన 30వ టెస్ట్ సెంచరీతో కేన్ విలియమ్సన్ ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్, ఇండియన్ స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీని అధిగమించాడు.
 


Virat Kohli - Kane Williamson: న్యూజిలాండ్ స్టార్ ప్లేయ‌ర్ కేన్ విలియ‌మ్స‌న్ టెస్టు క్రికెట్ లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. వ‌రుస సెంచ‌రీల‌తో బౌల‌ర్ల‌పై త‌న బ్యాట్ ప్ర‌తాపం  చూపిస్తున్నాడు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌పై సెంచ‌రీల మోత మోగిస్తున్నాడు. గతకొంత కాలంగా గాయాలతో స‌త‌మ‌త‌వుతున్న కేన్ విలియమ్సన్ మాత్రం న్యూజిలాండ్ జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తన స్థాయిని తగ్గించుకోకుండా ప‌రుగుల చేస్తన్నాడు.

ప్ర‌స్తుతం దక్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న టెస్టు మ్యాచ్ లో కివీస్ బ్యాట్స్ మన్ కేన్ విలియ‌మ్స‌న్ త‌న‌ అద్భుతమైన ఆట‌తో సెంచ‌రీ కొట్టి జట్టును కష్టాల ఊబి నుంచి తప్పించి ఆధిపత్యం దిశగా ముందుకు నడిపించాడు. ఈ క్ర‌మంలోనే ప‌లువురు దిగ్గ‌జ ప్లేయ‌ర్ల రికార్డుల‌ను అధిగ‌మించాడు.కేన్ విలియమ్సన్ తన 30వ టెస్టు సెంచరీని బాదాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన న్యూజిలాండ్ విలియ‌మ్స‌న్ యంగ్ ప్లేయ‌ర్ రచిన్ రవీంద్రతో కలిసి అజేయంగా 219 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

Latest Videos

ఎలా ఆడేది గురూ నువ్వు ఇలా బాల్ వేస్తే.. బుమ్రా బౌలింగ్ తో బెన్ స్టోక్స్ కు దిమ్మదిరిగిపోయింది.. వీడియో !

ఈ మ్యాచ్ లో సెంచ‌రీ కొట్టిన త‌ర్వాత కేన్ విలియమ్సన్ సెంచరీల సంఖ్య విరాట్ కోహ్లీ మార్కును దాటింది. ప్ర‌స్తుతం ఆడుతున్న క్రికెట‌ర్ల‌లో సెంచరీల పరంగా 2వ స్థానంలో నిలిచాడు. జో రూట్ 30 సెంచరీలతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. స్టీవ్ స్మిత్ 32 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 29 పరుగులతో త‌ర్వాతి స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో అధిక సెంచ‌రీల ప్లేయ‌ర్ల లిస్టులో కేన్ విలియ‌మ్స‌న్ విరాట్ కోహ్లీని అధిగ‌మించాడు.

టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు*

  • స్టీవ్ స్మిత్ - 32 సెంచరీలు (107 మ్యాచ్‌లు)
  • కేన్ విలియమ్సన్ - 30 సెంచరీలు (97 మ్యాచ్‌లు)
  • జో రూట్ - 30 సెంచరీలు (137 మ్యాచ్‌లు)
  • విరాట్ కోహ్లీ - 29 సెంచరీలు (113 మ్యాచ్‌లు)

కాగా, విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ లు గత దశాబ్దంలో అత్యంత నిలకడైన, ఆధిపత్య  చెలాయిస్తూ రాణిస్తున్న బ్యాట‌ర్స్ గా ఉన్నారు. ఈ నలుగురూ ఆయా దేశాల చాలా మ్యాచ్ ల‌కు విన్నర్లుగా నిలిచారు. టెస్టు క్రికెట్ విషయానికి వస్తే జో రూట్ అత్యంత అనుభవజ్ఞుడిగా నిలిచాడు. కోహ్లీ 113, స్మిత్ 107, విలియమ్సన్ 96 టెస్టులు ఆడగా,  జో రూట్ 136 టెస్టులు ఆడాడు. అత్యధికంగా రూట్ 11447 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అయితే, బెస్ట్ యావరేజ్ విష‌యంలో స్టీవ్ స్మిత్ 58.03 సగటుతో 9634 పరుగులు చేసి అందరికంటే ముందున్నాడు.

జట్టుకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీకి బిగ్ షాక్ ! కేన్ మామ దూకుడు !

click me!