Shubman Gill-Yashasvi: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యంగ్ ప్లేయర్స్ యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్ సెంచరీలతో చెలరేగారు. దీంతో 25 ఏళ్లలోపు ఒకే టెస్టులో సెంచరీ చేసిన రెండో భారత జోడీగా నిలిచారు. అలాగే, దిగ్గజ ప్లేయర్లను అధిగమించారు.
Shubman Gill-Yashasvi Jaiswal: విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ యంగ్ ప్లేయర్స్ యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్ లు సెంచరీల మోత మోగించారు. యశస్వి జైస్వాల్ తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ కొట్టాడు. అతని ఇన్నింగ్స్ లో 19 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. తన కెరీర్ లో తొలి డబుల్ సెంచరీని నమోదుచేశాడు. అలాగే, గత రెండు మూడు ఇన్నింగ్స్‌లలోనే కాకుండా గత కొంత కాలంగా పేలవ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ రెండో టెస్టు మూడో రోజు సెంచరీతో అదరగొట్టాడు.
రెండో టెస్టులో టీమిండియా యంగ్ ప్లేయర్స్ గిల్, జైస్వాల్ లు ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికి పారేశారు. అయితే, ఈ ఇన్నింగ్స్‌లో శుభ్‌మాన్ గిల్ సెంచరీ 28 ఏళ్ల క్రితం సాధించిన ఘనతను పునరావృతం చేసింది. 143 పరుగుల ఆధిక్యంతో రంగంలోకి దిగిన భారత జట్టుకు మూడో రోజు తొలి సెషన్ లోనే డబుల్ షాక్ తగిలింది. ఇంగ్లాండ్ సీనియర్ ప్లేయర్ జేమ్స్ అండర్సన్ కెప్టెన్ రోహిత్ శర్మ (13), యశస్వి జైస్వాల్‌లను అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ బాదాడు. తన కెరీర్ లో 10 సెంచరిని నమోదుచేశాడు. గిల్ 132 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో గిల్ భారత బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లను అధిగమించాడు.
రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్ (9)లను కూడా గిల్ అధిగమించాడు. 2017 తర్వాత భారత పిచ్‌పై మూడో స్థానంలో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా గిల్ నిలిచాడు. అలాగే, యశస్వి జైస్వాల్-శుభ్‌మన్ గిల్ లు ఒకే టెస్టులో సెంచరీలు సాధించారు.. 25 ఏండ్ల లోపు టెస్టులో సెంచరీ చేసిన రెండవ భారత జోడీగా నిలిచారు. యశస్వి జైస్వాల్ కు 22 ఏళ్లు కాగా, శుభ్‌మన్ గిల్ కు 24 ఏళ్లు. ఇంతకుముందు 1996లో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు నాటింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌పై ఇదే విధమైన ఫీట్ ను సాధించారు. అప్పటికి సచిన్, దాదా వయస్సులు 25 ఏళ్లలోపుగా ఉంది.
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్