IND vs SA: తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టు ఇదే..! ఓపెనర్లు ఎవరంటే? 

By Rajesh KarampooriFirst Published Dec 24, 2023, 6:56 PM IST
Highlights

IND vs SA: భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో ఒకసారి కూడా టీమిండియా టెస్ట్ సిరీస్ గెలువలేదు. ఈ సారి ఆ లోటు తీర్చుకోవాలని భావిస్తోంది. అయితే..ఈ నెల 26 నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మొదటి టెస్టులో టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటే బాగుంటుందనే అంశంపై టీమిండియా క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.  

IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా టీ20 సిరీస్‌ని 1-1 తో సమం చేసి.. అనంతరం ఆడిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికాపై అధిపత్యం చేలాయించి.. సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే.. ఇప్పడూ రోహిత్ శర్మ కెప్టెన్సీలో  రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. సెంచూరియన్‌లోని సూపర్ ‌స్పోర్ట్ పార్క్ వేదికగా జరుగనున్న భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌ లోని తొలి మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా సఫారీ జట్టుపై విజయం సాధించి.. సరికొత్త చరిత్ర సృష్టించాలని రోహిత్ సేన భావిస్తోంది. 

అయితే తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మొదటి టెస్టులో టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటే బాగుంటుందనే అంశంపై టీమిండియా క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆయన ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించారు. 

Latest Videos

 ఓపెనర్లుగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, లెప్ట్ హ్యండ్ బ్యాట్స్ మెన్ యశస్వి జైస్వాల్ ఆడాలని పేర్కొన్నాడు. మూడో స్థానంలో శుభమాన్ గిల్ ఆడాలని సూచించాడు.గతంలో థర్డ్ డౌన్ లో చటేశ్వర్ పుజారా ఆడేవాడు. కానీ, ప్రస్తుతం అతను ఫామ్ లో లేకపోవడంతో జట్టుకు దూరమయ్యారు. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ ని 4 స్థానంలో ఆడాలని సూచించారు.  

సునీల్ గవాస్కర్ ప్లేయింగ్ ఎలెవన్ ఇలా.. 

ఓపెనర్లు- రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్
టాప్ ఆర్డర్- శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ
మిడిల్ ఆర్డర్- శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్)
ఆల్ రౌండర్లు- రవీంద్ర జడేజా, రవి అశ్విన్
బౌలర్లు- ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

లిటిల్ మాస్టర్ తన ప్లేయింగ్ ఎలెవన్‌లో ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లను ఫాస్ట్ బౌలర్లుగా చేర్చుకున్నాడు.కానీ, ప్లేయింగ్ ఎలెవన్‌లో శార్దూల్ ఠాకూర్‌కు మాత్రం చోటు ఇవ్వలేదు. నిజానికి.. ఇటీవల మహ్మద్ షమీ గాయం కారణంగా మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. మహ్మద్ షమీ చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఆడటం ఖాయమని నమ్ముతారు. అయితే ముఖేష్ కుమార్ లేదా ప్రసిద్ధ్ కృష్ణలలో ఒకరికి అవకాశం రావచ్చు.

click me!