ఐసీసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్న శశాంక్ మనోహర్.. రేసులో సౌరవ్ గంగూలీ

By Siva KodatiFirst Published Jul 2, 2020, 6:34 PM IST
Highlights

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ దిగిపోయారు. ఈ విషయాన్ని ఐసీసీ ప్రకటించింది. రెండేళ్లు, రెండు పర్యాయాలు ఆయన ఛైర్మన్‌గా పనిచేశారని తెలిపింది. మరొకరు ఎన్నికయ్యే వరకు ఆ బాధ్యతలను డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజా నిర్వహిస్తారని వెల్లడించింది

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ దిగిపోయారు. ఈ విషయాన్ని ఐసీసీ ప్రకటించింది. రెండేళ్లు, రెండు పర్యాయాలు ఆయన ఛైర్మన్‌గా పనిచేశారని తెలిపింది.

మరొకరు ఎన్నికయ్యే వరకు ఆ బాధ్యతలను డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజా నిర్వహిస్తారని వెల్లడించింది. వారం రోజుల్లో కొత్త ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ ఆరంభమవుతుందని సమాచారం.

Also Read:"థూ...." క్రికెట్ ఆటలో సరికొత్త వివాదం, చోద్యం చూస్తున్న ఐసీసీ!

ఐసీసీ ఛైర్మన్‌గా ఆయన క్రికెట్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని వెల్లడించింది. ఆయన నాయకత్వానికి అభినందనలని ఐసీసీ సీఈవో మను సాహ్ని అన్నారు. మనోహర్ చేసిన దానికి క్రికెట్ రుణపడి ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదని డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాజ్ ఖవాజా ప్రశంసించారు.

మరోవైపు కొత్త ఛైర్మన్ ఎంపిక ప్రక్రియను వారం రోజుల్లో ఆరంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈసీబీ మాజీ ఛైర్మన్ కొలిన్‌గ్రేవ్స్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పోటీలో ఉన్నారు.

Also Read:ఐసీసీ ఛైర్మన్ రేసులో గంగూలీ

ఏవరైనా సరే ఏకగ్రీవం కోసమే ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు గంగూలీ అభ్యర్ధిత్వం గురించి బీసీసీఐ ఒక్క మాట కూడా చెప్పలేదు. అనూహ్య పరిణామాలు చెబితే  దాదా ఐసీసీ ఛైర్మన్ పదవికి ఎంపికైనా ఆశ్చర్యం లేదు. 

click me!