లెజండరీ క్రికెటర్ కన్నుమూత.. విండీస్ క్రికెట్‌లో ముగిసిన త్రీ డబ్ల్యూఎస్‌ శకం

By Siva KodatiFirst Published Jul 2, 2020, 5:55 PM IST
Highlights

వెస్టిండీస్ క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ లెజెండరీ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఎవర్టన్ వీక్స్ బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. 

వెస్టిండీస్ క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ లెజెండరీ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఎవర్టన్ వీక్స్ బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు.

విండీస్ తరపున 1948-58 మధ్యకాలంలో 48 టెస్టులు ఆడిన ఎవర్టన్ 58.61 స్ట్రైక్‌రేటుతో 4,455 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 19 అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా ఎవర్టన్ మృతిపై కరేబియన్ జట్టు స్పందించింది.  ‘‘ ది లెజెండ్ సర్ ఎవర్టన్ వీక్స్ మరణం తమ గుండెల్ని పిండేసింది.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఎవర్టన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేసింది. కాగా 1950 దశకంలో క్లైడ్ వాల్కాట్, ఫ్రాంక్ వొరెల్, ఎవర్టన్ వీక్స్‌లు త్రీ డబ్ల్యూఎస్‌గా గుర్తింపు  పొందారు.

ఈ ముగ్గురు దిగ్గజాల్లో వాల్కట్ 2006లో, వొరెల్ 1967లో మరణించారు. తాజాగా ఎవర్టన్ మరణంతో త్రీ డబ్ల్యూఎస్ శకం ముగిసినట్లయ్యింది. వీరి సేవలకు గుర్తుగా విండీస్ క్రికెట్ బోర్డు బ్రిడ్జ్ టౌన్‌లోని నేషనల్ స్టేడియం పేరుకు త్రీ డబ్ల్యూఎస్‌గా నామకరణం చేశారు. 

click me!