Sehwag on Dhawan Retirement: టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. ఈ క్రమంలోనే మాజీ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ గబ్బర్‌కు విభిన్నంగా శుభాకాంక్షలు తెలపడం వైరల్ గా మారింది.
Sehwag on Dhawan Retirement : అంతర్జాతీయ క్రికెట్ కు భారత్ స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. శనివారం క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నానని ధావన్ ప్రకటించడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. భారత క్రికెట్ జట్టుతో అద్భుతమైన ప్రయాణం చేశాననీ, ఇప్పుడు వీడ్కోలు తీసుకుంటున్నానని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే అతని అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. పలువురు వెటరన్ ఆటగాళ్లు ధావన్ భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో మాజీ భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఉన్నారు. సెహ్వాగ్ ఒక పోస్ట్ ద్వారా ధావన్‌కు ప్రత్యేకమైన రీతిలో శుభాకాంక్షలు తెలియజేశాడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సెహ్వాగ్ ను బాధపెట్టిన శిఖర్ ధావన్?
undefined
శిఖర్ ధావన్ భారత క్రికెట్ జట్టులోకి రాకముందు టీమిండియాకు ఓపెనర్ గా స్టార్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. శిఖర్ ధావన్ మంచి ప్రదర్శనల కారణంగా 2010లో టీమ్ ఇండియాలో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 2011లో టీ20 జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, ప్రారంభంలో పెద్ద ఇన్నింగ్స్ లను ఆడటంలో ఇబ్బంది పడ్డాడు. కానీ, కొన్ని రోజులకే ధావన్ భారత జట్టులో బలమైన పిల్లర్ గా మారాడు. 2013లో టీమ్ ఇండియాకు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. జట్టును ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా శిఖర్ ధావన్ నిలిచాడు. ఆ తర్వాత ధావన్‌ని కూడా టెస్టు జట్టులోకి తీసుకున్నారు. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతుండడంతో అతని స్థానంలో శిఖర్ ధావన్ ఆడే అవకాశం లభించింది. ఇప్పుడు గబ్బర్ రిటైర్మెంట్ పై వీరూ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు.
సచిన్ టెండూల్కర్ బ్యాట్ నుంచే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు.. కొట్టింది మాత్రం పాక్ ప్లేయర్ !
వీరేంద్ర సెహ్వాగ్ ఏం చెప్పాడంటే..?
వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'అభినందనలు శిఖర్ ధావన్.. మీరు మొహాలీలో నా స్థానంలోకి వచ్చినప్పటి నుండి, మీరు వెనుదిరిగి చూడలేదు. గత కొన్నేళ్లుగా అద్భుతంగా ముందుకుసాగారు. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. పూర్తి జీవితాన్ని సంతోషంగా గడపండి. మీకు శుభాకాంక్షలు' అంటూ పేర్కొన్నాడు. శిఖర్ ధావన్ జట్టులోకి వచ్చిన తర్వాత మూడు ఫార్మాట్లలో టీమిండియాలో స్థిరపడిపోయాడు. దాని తర్వాత సెహ్వాగ్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మొత్తంగా సెహ్వాగ్ ప్లేస్ లో ధావన్ నిలిచి.. ఇప్పటివరకు క్రికెట్ లో కొనసాగాడు.
రిటైర్మెంట్ లో ధావన్ ఏం చెప్పాడంటే..?
రిటైర్మెంట్ సందర్భంగా శిఖర్ ధావన్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. "హలో, నేను ఈ రోజు వెనక్కి తిరిగి చూస్తే చాలా జ్ఞాపకాలు కనిపించే పాయింట్‌లో నిలబడి ఉన్నాను. భారత్ తరఫున ఆడాలనే లక్ష్యం నాకు ఎప్పుడూ ఉండేది, అది జరిగింది. అందుకు నేను చాలా మందికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముందుగా నా కుటుంబం, నా చిన్ననాటి కోచ్‌లు. ఎందుకంటే వారివద్దనే నేను క్రికెట్ నేర్చుకున్నా. అంతర్జాతీయ క్రికెట్‌కు, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నాను. బీసీసీఐకి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. థ్యాంక్యూ.." అని శిఖర్ ధావన్ పేర్కొన్నాడు.
ధోనీకి క్షమాపణలు చెప్పిన దినేష్ కార్తీక్.. ఏం జరిగిందంటే?