రాధిక-అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ధోని, హార్దిక్ పాండ్యా !

By Mahesh Rajamoni  |  First Published Mar 2, 2024, 2:52 PM IST

Anant-Radhika’s pre-wedding: స‌చిన్ టెండూల్క‌ర్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి భారత క్రికెట్ జట్టు స్టార్లు స‌హా రణ్‌బీర్ కపూర్, అలియా భట్, అర్జున్ కపూర్ సహా అనేక మంది సెలబ్రెటీలు రాధిక-అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొంటున్నారు.
 


Anant-Radhika’s pre-wedding celebrations: భారతదేశపు కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పాప్ ప్రపంచంలోని ప్రముఖులు, భారత క్రికెట్ టీమ్ స్టార్లు, వ్యాపార దిగ్గజాలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జ‌రుగుతున్న వేడుకకు హాజరయ్యారు. అనంత్ అంబానీ వెడ్డింగ్ వేడుక‌ల‌కు హాజ‌రైన భార‌త క్రికెట‌ర్ల‌లో స‌చిన్ టెండూల్క‌క‌ర్, ఎంఎస్ ధోని, జ‌హీర్ ఖాన్, పాండ్యా బ్ర‌ద‌ర్స్ ఇలా చాలా మందే ఉన్నారు.

అనంత్ అంబానీ పెళ్లిలో క‌నిపించిన క్రికెట్ స్టార్లు

Latest Videos

సచిన్ టెండూల్కర్
ఎంఎస్ ధోని
జహీర్ ఖాన్
సామ్ కర్రాన్
రోహిత్ శర్మ
హార్దిక్ పాండ్యా
కృనాల్ పాండ్యా
ఇషాన్ కిషన్
జస్ప్రీత్ బుమ్రా
డీజే బ్రావో

 

MS Dhoni & Sakshi during the Pre Wedding of Anant Ambani.

- Picture of the Day. ❤️ pic.twitter.com/A81036fONe

— Johns. (@CricCrazyJohns)

ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి భారత క్రికెట్ జట్టు స్టార్లతో పాటు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అర్జున్ కపూర్‌లతో సహా వినోద పరిశ్రమకు చెందిన చాలా మంది ప్ర‌ముఖులు అనిత్ అంబానీ వేడుక‌లో భాగ‌మ‌య్యారు. అలాగే, గాయని రిహన్న, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వంటి అంతర్జాతీయ ప్ర‌ముఖులు, భార్య ప్రిస్సిల్లా చాన్‌తో కలిసి వివాహా వేడుక‌క‌కు వ‌చ్చారు. అంబానీ గ్రాండ్ వెడ్డింగ్‌లో బిల్ గేట్స్ కూడా పాల్గొననున్నారు.

ఘ‌నంగా ఉత్సవాలు:

ఈ వేడుకలు బుధవారం సాంప్రదాయ "అన్న సేవ" వేడుకతో ప్రారంభమయ్యాయి. ఇక్కడ అనంత్ అంబానీ కుటుంబం సమీపంలోని గ్రామంలోని 51,000 మంది నివాసితులకు భోజనం అందించింది. స్వ‌యంగా అంబానీలు గ్రామ‌స్తుల‌కు భోజ‌నం వ‌డ్డించారు. గుజరాతీ గాయకుడు కీర్తిదాన్ గాధ్వి వంటి ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు రాబోయే రోజుల్లో మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు జ‌ర‌గున్నాయి.

 

pic.twitter.com/uFEpkjYFS4

— Sumit (@shriramjibhakt)
click me!