WPL 2024: తీరు మారలేదు.. గుజరాత్‌పై యూపీ వారియర్స్ విజయం!

By Rajesh Karampoori  |  First Published Mar 2, 2024, 12:00 AM IST

WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో UP వారియర్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పెను మార్పు చోటుచేసుకుంది.   
 


WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను యూపీ వారియర్స్ ఓడించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో అలిస్సా హీలీ నేతృత్వంలోని యూపీ వారియర్స్, బెత్ మూనీ నేతృత్వంలోని గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై 6 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ విజయం సాధించి..  తన ఖాతాలో రెండో విజయాన్ని వేసుకుంది యూపీ వారియర్స్.

మరోవైపు గుజరాత్ జెయింట్స్‌కి ఇది మూడో మ్యాచ్ కాగా ఇప్పటికీ వారి ఖాతా తెరవలేదు. గుజరాత్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. ఈ మ్యాచ్ లో యూపీ విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. యుపి విజయంతో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు పెద్ద దెబ్బ తగిలింది. దీంతో ఆ జట్టు నాలుగో స్థానానికి పడిపోయింది.

Latest Videos

undefined

ఇక ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూపీకి శుభారంభం లభించింది. 143 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూపీ వారియర్స్‌కు యూపీ వారియర్స్‌కు అలిస్సా హీలీ, కిరణ్ నవ్‌గిరే శుభారంభం అందించారు. కిరణ్ నవ్‌గిరేతో కలిసి కెప్టెన్ అలిస్సా హీలీ తొలి వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  12 పరుగుల వద్ద కిరణ్ అవుట్ అయ్యారు. ఆ తరువాత 21 బంతుల్లో 33 పరుగులు చేసిన హీలీ రూపంలో జట్టుకు రెండో దెబ్బ తగిలింది. మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన చమరి అటపట్టు తన తొలి మ్యాచ్‌లో 17 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకుంది.

ఆ తరువాత బ్యాటింగ్ వచ్చిన శ్వేతా సెహ్రావత్ అంతగా రాణించలేకపోయింది.  ఈ తరణంలో గ్రేస్ హారిస్, దీప్తి శర్మలు నిలకడగా ఆటడారు. లక్ష్యాన్ని చేధించే బాధ్యతను తమపై వేసుకున్నారు. వీరిద్దరూ 30 బంతుల్లో 53 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్‌లో హారిస్ 33 బంతుల్లో 60 పరుగులు చేయగా, దీప్తి 14 బంతుల్లో 17 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడారు. ఇలా యూపీ 15.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసి విజయం సాధించింది. గుజరాత్‌ తరఫున తనూజ రెండు వికెట్లు తీయగా, మేఘన, కేథరిన్‌లకు చెరో వికెట్ దక్కింది. అంతముందు బ్యాటింగ్ చేసిన  గుజరాత్ జెయింట్స్ జట్టు కేవలం 142 పరుగులకే వెనుదిగాల్సి వచ్చింది.  
 
మార్కుల పట్టికలో భారీ మార్పు

యూపీ విజయంతో పాయింట్ల పట్టికలో పెను మార్పులు జరిగాయి. నాలుగు పాయింట్లతో యూపీ జట్టు మూడో స్థానానికి చేరుకుంది. అదే సమయంలో నెట్ రన్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్‌  ఓ మెట్టు దిగాల్సివచ్చింది. హమ్రాన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని జట్టు నాలుగు పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంది. అదే సమయంలో  గుజరాత్ జెయింట్స్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడి ఐదో స్థానంలో నిలిచింది.పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది.
 

click me!