CCL 2024: సోనూసూద్ కు షాకిచ్చిన్ అక్కినేని అఖిల్..

Published : Mar 02, 2024, 09:24 AM IST
CCL 2024:  సోనూసూద్ కు షాకిచ్చిన్  అక్కినేని అఖిల్..

సారాంశం

Celebrity Cricket League 2024: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) రెండో సీజ‌న్ హైదరాబాద్ వేదిక‌గా ప్రారంభం అయింది. తాజా మ్యాచ్ లో అక్కినేని అఖిల్ టీమ్ తెలుగు వారియ‌ర్స్ సోనూసూద్ నాయ‌క‌త్వంలోని పంజాబ్ డే షేర్ కు షాకిచ్చింది.  

Celebrity Cricket League (CCL 2024) : సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 10వ ఎడిషన్ (సీసీఎల్ 2024) రెండో ద‌శ మ్యాచ్ లు హైద‌రాబాద్ లో ఘ‌నంగా ప్రారంభం అయ్యాయి. మార్చి 1న అక్కినేని అఖిల్ నాయ‌క‌త్వంలోని తెలుగు వారియర్స్-సోనూసూద్ సార‌థ్యంలోని పంజాబ్ డే షేర్ టీమ్ ల మ‌ధ్య తొలి మ్యాచ్ జ‌రిగింది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024 మైదానంలో సినీ తారలు తమ అత్యుత్తమ ప్రదర్శనతో అద్భుతంగా ఆడారు. ఈ 7వ మ్యాచ్‌లో పంజాబ్ డి షేర్ జట్టుతో తెలుగు వారియర్స్ హోరాహోరీగా తలపడింది.

మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగింది. తెలుగు వారియర్స్ టీమ్ లోని సంగీత ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ తమన్ బ్యాట్ తో అద‌ర‌గొట్టాడు. దీంతో పంజాబ్ డే షేర్ పై తెలుగు వారియ‌ర్స్ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో అక్కినేని అఖిల్ సార‌థ్యంలోని తెలుగు వారియ‌ర్స్ జట్టు 59-7 ప‌రుగులు, సోనూ సూద్ జట్టు 72-7 ప‌రుగులు సాధించాయి. ఇక రెండో ఇన్నింగ్స్ లో తెలుగు వారియర్స్ 5 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో పంజాబ్ డే షేర్  ఐదు వికెట్లతో 93 పరుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది.

స‌చిన్-ధోనీ-విరాట్ కంటే ఖరీదైన ఇల్లు.. ఈ భార‌త‌ క్రికెట్ క్వీన్ ఎవ‌రో తెలుసా?

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థమన్ సంగీతంలోనే కాదు క్రికెట్ లో మెరుపులు మెరిపించాడు. పంజాబ్ డే షేర్ తో జ‌రిగిన మ్యాచ్ లో తెలుగు వారియర్స్ జట్టులో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. థ‌మ‌న్ రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం 30 బంతుల్లో 67 పరుగులతో సోనూసూద్ టీమ్ బౌలింగ్ ను ఉతికిపారేశాడు. థమన్ అద్భుత ప్రదర్శనతో తెలుగు వారియర్స్ పంజాబ్ డే షేర్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. త‌మ‌న్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

 

టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 ప‌రుగులు సాధించిన టాప్-5 భార‌త క్రికెట‌ర్లు వీరే ! 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !