రిషబ్ పంత్ ఔట్ ! బెంచ్‌ను హీటెక్కించిన రియాన్ పరాగ్ ! భార‌త‌ తుది జ‌ట్టులో ఉండేది ఎవ‌రు?

By Mahesh Rajamoni  |  First Published Jul 19, 2024, 7:19 PM IST

Team India : శ్రీలంక‌లో భార‌త జ‌ట్టు ప‌ర్య‌ట‌న జూలై 27 నుంచి ప్రారంభం కానుంది. తొలుత‌ భారత్-శ్రీలంక మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. త‌ర్వాత వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది. ఈ క్ర‌మంలోనే బీసీసీఐ రెండు సిరీస్ ల‌కు స్క్వాడ్ ను ప్ర‌క‌టించింది. 
 


Team India : భార‌త జ‌ట్టు ఈ నెల‌లో శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ మూడు టీ20ల సిరీస్, మూడు వ‌న్డేల సిరీస్ లో శ్రీలంక తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న జూలై 27 నుంచి ప్రారంభం కానుంది. మూడు వ‌న్డే మ్యాచ్ లు ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో జరగనున్నాయి. ఈ క్ర‌మంలోనే బీసీసీఐ టీమిండియా స్క్వాడ్ ను ప్ర‌క‌టించింది. టీ20 ప్ర‌పంచ‌ ఛాంపియ‌న్ ప్లేయ‌ర్ రోహిత్ శ‌ర్మ భార‌త వ‌న్డే జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. 

శ్రీలంక ప‌ర్య‌ట‌న కోసం బీసీసీఐ ప్ర‌క‌టించిన భార‌త వన్డే జట్టులో రోహిత్ శర్మ ( కెప్టెన్), శుభ్ మ‌న్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్), రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణాలు ఉన్నారు. అయితే, ప్ర‌స్తుతం జ‌ట్టులో ఉన్న ప్లేయ‌ర్ల‌ను గ‌మ‌నిస్తే ప్లేయింగ్ 11 లో ఎవ‌రుంటార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకంటే టీమ్ లోని ప్లేయ‌ర్లు అంద‌రూ మంచి ట్రాక్ రికార్డును క‌లిగివున్నారు. వికెట్ కీప‌ర్లుగా రాహుల్ తో పాటు సంజూ శాంస‌న్ ఉన్నాడు. కొత్త‌గా రియాన్ ప‌రాగ్ కూడా జ‌ట్టులోకి వ‌చ్చాడు. కేఎల్ రాహుల్  కార‌ణంగా రిష‌బ్ పంత్ బెంచ్ కు ప‌రిమితం అయ్యే అవ‌కాశ‌ముంది. అలాగే, రియ‌న్ ప‌రాగ్ రాక‌తో బెంచ్ లో ఎవ‌రిని ఉంచుతారనేది ఉత్కంఠ‌ను పెంచుతోంది.

Latest Videos

undefined

అయితే, ప్ర‌స్తుతం బీసీసీఐ ప్ర‌క‌టించిన జ‌ట్టులో ప్లేయింగ్ 11 కోసం బెస్ట్ అప్ష‌న్ గ‌మ‌నిస్తే.. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, గిల్ లు జట్టులో త‌ప్ప‌కుండా ఉంటారు. నాల్గో స్థానంలో బ్యాటింగ్  కోసం జ‌ట్టు శ్రేయాస్ అయ్య‌ర్ ఉన్నాడు. టీ20 ప్ర‌పంచ క‌ప్ జ‌ట్టులో చోటుద‌క్క‌లేదు కానీ, ఐపీఎల్ 2024 లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. కేకేఆర్ కు టైటిట్ ను అందించాడు. శ్రీలంకతో వ‌న్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ పాత్ర పోషించ‌నున్నాడు. ఇదే స‌మ‌యంలో రిషబ్ పంత్‌కు విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే చాలా రోజుల త‌ర్వాత క్రికెట్ ఆడ‌టం.. ఐపీఎల్, టీ20 ప్ర‌పంచ క‌ప్ తో అత‌నికి విశ్రాంతి లేదు. ఇక కేఎల్ రాహుల్ ఎలాంటి ప్లేయ‌ర్ అనేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. చాలా సంద‌ర్బాల్లో టీమిండియాకు సూపర్ ఇన్నింగ్స్ లతో అద్భుత విజ‌యాలు అందించాడు. 

ఈ ఐదుగురికి అన్యాయం జ‌రిగిందా? అర్హ‌త‌లున్న టీమిండియాలోకి ఎందుకు తీసుకోలేదు?

అక్షర్ పటేల్ టీమ్ ఇండియాకు స్పిన్ ఆల్ రౌండర్‌గా ఉండాలి. అక్ష‌ర్ జ‌ట్టులో ఉంటే బ్యాట్, బౌలింగ్ లో జ‌ట్టుకు మంచి బ‌లాన్ని అందిస్తాడు. టీ20 ప్రపంచ క‌ప్ లో బ్యాట్, బాల్ తో భార‌త్ ఛాంపియ‌న్ గా నిల‌వ‌డంతో అక్ష‌ర్ ప‌టేల్ కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఇక రైట్ ఆర్మ్ స్పిన్నర్‌గా వాషింగ్టన్ సుందర్ జ‌ట్టుకు ఉపయోగపడతాడు. స్పిన్ విభాగంలో పటేల్ లెఫ్ట్ ఆర్మర్‌గా, సుందర్ రైట్ ఆర్మర్‌గా ఉండటంతో, మెన్-ఇన్-బ్లూ అద్భుతమైన స్పిన్ విభాగాన్ని క‌లిగి ఉంటుంది. పుల్ టైమ్ స్పిన్న‌ర్ గా కుల్దీప్ యాద‌వ్ జ‌ట్టులో ఉండాలి. ప్రపంచ కప్‌లో అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించి జట్టును విజయపథంలో నడిపించాడు. 

శ్రీలంక సిరీస్ లో మహ్మద్ సిరాజ్ మ‌రోసారి త‌న‌దైన పాత్ర పోషించే అవ‌కాశ‌ముంది. ఎందుకంటే గ‌తేడాది ఆసియా కప్ 2023 ఫైనల్లో అల్లకల్లోలం చేసిన మహ్మద్ సిరాజ్‌ను ఎవరు మర్చిపోగలరు? సిరాజ్ ఒక ఓవర్‌లో 4 వికెట్లు పడగొట్టి శ్రీలంక‌ను (6/21) క‌ష్టాల్లోకి నెట్టాడు. ఈ మ్యాచ్ లో శ్రీలంక కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. అర్ష్‌దీప్ సింగ్ టీమిండియాకు మరో అద్భుతమైన పేసర్‌.. ఈ ఎడ‌మ‌చేతి వాటం పేస‌ర్ ప్రస్తుతం అద్భుత ఫామ్ లో ఉన్నాడు కాబ‌ట్టి ఈ బౌల‌ర్ జ‌ట్టులో ఉండాల్సిందే. హర్షిత్ రాణా తుది జ‌ట్టులోకి తీసుకుని ప్ర‌యోగం చేయ‌వ‌చ్చు. ఎందుకంటే ఖలీల్ అహ్మ‌ద్ కూడా అర్ష్‌దీప్ సింగ్ లాగా లెఫ్ట్ ఆర్మర్ కాబట్టి ఇద్దరు లెఫ్ట్ ఆర్మర్స్ జ‌ట్టుకు అవసరం లేదని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

Shubman Gill: శుభ్‌మ‌న్ గిల్ పై మనసుపారేసుకున్న స్టార్ హీరోయిన్.. !

 

click me!