హార్దిక్ కు బిగ్ షాకిచ్చిన గంభీర్.. టీమిండియాకు కొత్త టీ20 కెప్టెన్‌..

By Mahesh Rajamoni  |  First Published Jul 18, 2024, 11:31 PM IST

Team India : శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సెలక్ష‌న్ క‌మిటీ భారత జట్టును ప్ర‌క‌టించింది. వన్డే జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. టీ20 క్రికెట్ కు కొత్త కెప్టెన్ ను ప్ర‌క‌టించారు. రెండు ఫార్మాట్లలో శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఉండ‌నున్నాడు.
 


India Squad for Sri Lanka Tour : శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. జూలై 27 నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్‌లో భార‌త జ‌ట్టు శ్రీలంకతో 3 టీ20, 3 వన్డే మ్యాచ్‌లు ఆడ‌నుంది. భార‌త ప్ర‌ధాన కోచ్ గౌత‌మ్ గంభీర్, బీసీసీఐలు హార్ధిక్ పాండ్యాకు బిగ్ షాకిచ్చాయి. భార‌త టీ20 జ‌ట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న పాండ్యాకు కెప్టెన్సీ అప్ప‌గిస్తార‌ని టాక్ న‌డిచింది. కానీ, చివ‌ర‌కు భార‌త జ‌ట్టు కొత్త టీ20 కెప్టెన్ తో శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. హార్ధిక్ పాండ్యా త‌న వైస్ కెప్టెన్సీని కూడా కోల్పోయాడు. టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ భార‌త్ కు నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. రోహిత్ శర్మ టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న క్ర‌మంలోనే అత‌ని స్థానంలో సూర్య భార‌త కెప్టెన్సీని చేప‌ట్టాడు. ఇక‌ వన్డే జట్టుకు రోహిత్ శ‌ర్మ కెప్టెన్ గా ఉండ‌నున్నాడు.

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ముగిసిన త‌ర్వాత భార‌త ప్ర‌ధాన కోచ్ గా రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వీకాలం ముగిసింది. అత‌ని స్థానంలో టీమిండియా మాజీ ఓపెన‌ర్ గౌత‌మ్ గంభీర్ వ‌చ్చాడు. ఇప్పుడు భార‌త జ‌ట్టులో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. టీ20కి కొత్త కెప్టెన్‌గా ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ లు ఆడే సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండగా, వన్డే జట్టులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. రెండు ఫార్మాట్ల జట్టుకు శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రియాన్ పరాగ్, హర్షిత్ రాణాకు వన్డే జట్టులో చోటు ద‌క్కింది. 

Latest Videos

భార‌త టీ20 జ‌ట్లు : 

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.

టీమిండియా వ‌న్డే జ‌ట్టు :

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియ‌న్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.

భారత్ శ్రీలంక ప‌ర్య‌ట‌న  షెడ్యూల్ ఇదే.. 

27 జూలై – 1వ టీ20, పల్లెకెలె
28 జూలై – 2వ టీ20, పల్లెకెలె
30 జూలై – 3వ టీ20, పల్లెకెలె
2 ఆగస్టు – 1వ వ‌న్డే, కొలంబో 
4 ఆగస్టు – 2వ వ‌న్డే, కొలంబో 
7 ఆగస్టు – 3వ వ‌న్డే, కొలంబో

నటాషాతో బంధం తెగిపోయింది.. ఇటు కెప్టెన్సీ పోయింది.. హార్దిక్ పాండ్యా ఎమోష‌నల్

click me!