Hardik Pandya Natasa Stankovic Divorce : స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాసా స్టాకోవిచ్ లు తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. హార్దిక్ పాండ్యాకు అటు నటాషాతో బంధం తెగిపోయింది.. ఇటు టీమిండియా కెప్టెన్సీ పోయింది.. !
Hardik Pandya Natasa Stankovic Divorce : టీమిండియా ఛాంపియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ లు విడాకులు తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా వారి వివాహ బంధంలో సమస్యలు ఉన్నాయనీ, తమ బంధాన్ని తెంచుకున్నారనే వార్తలు వచ్చినా పెద్దగా స్పందించలేదు. కానీ, గురువారం (18 జులై) నాడు ఈ జంట తమ విడాకుల గురించి అధికారికంగా ప్రకటించారు. తమ వివాహ సంబంధాన్ని తెంచుకుంటున్నామని సోషల్ మీడియాలో అభిమానులకు తెలియజేశారు. గత 6 నెలలుగా వీరిద్దరి బంధంలో మనస్పర్థలు వచ్చాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, ఈ జంట గత 4 సంవత్సరాలుగా కలిసి ఉంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. హార్దిక్-నటాషా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ లో తన వీడాకుల గురించి పేర్కొన్నారు. నాలుగు సంత్సరాలుగా కలిసి ఉన్నామనీ, ఇప్పుడు విడిపోతున్నామని చెప్పారు. తమ నిర్ణయం పట్ల మీ మద్దతు ఉంటుందని భావిస్తున్నామని ఇరువురు అభిమానులను కోరారు. ఇన్ని రోజులు గొప్ప బంధాన్ని కొనసాగించామనీ, తమ కుటుంబం కూడా పెరిగిందని తన కుమారుడు అగస్త్యు గురించి ప్రస్తావించారు. అతనికి తామిద్దరం సహ-తల్లిదండ్రులుగా ఉంటూ అవసరమైన అన్ని చేస్తామని చెప్పారు.
undefined
Shubman Gill: శుభ్‌మన్ గిల్ పై మనసుపారేసుకున్న స్టార్ హీరోయిన్.. !
గతేడాది వరకు హార్దిక్, నటాషా చాలా సంతోషంగా ఉన్నారు. వీరిద్దరూ 2023లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. 2020 సంవత్సరంలో నటాషాతో నిశ్చితార్థం చేసుకున్నట్లు హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను పోస్ట్ చేస్తూ తమ రిలేషన్ గురించి వెల్లడించాడు. ఇద్దరూ చాలా రోజులు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ, హార్దిక్ ఐపీఎల్ 2024 ముందు నుంచి దారుణ పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ సమయంలో నటాషా కనిపించలేదు.. టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత కూడా ఛాంపియన్ ప్లేయర్ హార్దిక్ తో నటాషా కనిపించలేదు.
నటాషాతో విడాకులు తీసుకున్నామని ప్రకటించిన రోజునే హార్దిక్ పాండ్యాకు మరో బిగ్ షాక్ తగిలింది. భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాకు ఫుల్ టైమ్ కెప్టెన్సీ దక్కుతుందని అందరూ భావించారు. కానీ, కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు సెలక్షన్ కమిటీ మరో ప్లేయర్ కు కెప్టెన్సీ అప్పగించి హార్దిక్ కు మొండిచేయి చూపింది. టీమిండియా కొత్త కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ను నియమించింది. ఈ రోజును జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా హార్ధిక్ జీవితంలో చెడ్డ రోజుగా మిగులుతుందని చెప్పవచ్చు.
HARDIK-NATASA DIVORCE : హార్దిక్-నటాషా విడాకులు.. పాండ్యా భావోద్వేగ పోస్ట్..