RCB vs CSK: ఐపీఎల్ 2024లో గ్రాండ్ గా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో బెంగళూరు-చెన్నైటీమ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో అదరగొట్టిన ఆర్సీబీ పవర్ ప్లే తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది.
Royal Challengers Bengaluru vs Chennai Super Kings : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2024) 17వ సీజన్ ఘనంగా ప్రారంభం అయింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2024 లో భాగంగా తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ లో బెంగళూరు టీమ్ కు ఓపెనర్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అదరిపోయే ఆరంభాన్ని అందించాడు. అయితే, డుప్లెసిస్ ఔట్ అయిన తర్వాత బెంగళూరు జట్టు వరుసగా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లుగా డుప్లెసిస్, కింగ్ విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చారు. మ్యాచ్ ఆరంభంలో డుప్లెసిస్ అదరిపోయే బౌండరీలతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వరుస ఫోర్లు బాదుతూ నాలుగు ఓవర్లలోనే 40 పరుగులు దాటించాడు.
IPL Opening Ceremony: త్రివర్ణ పతాకంతో.. ఆర్మీ క్యాస్టుమ్ స్టైల్లో దుమ్మురేపిన అక్షయ్ కుమార్..
అయితే, 5వ ఓవర్ 3 బంతికి ముస్తాఫిజుర్ బౌలింగ్ బిగ్ షాట్ కొట్టబోయే రచిన్ రవీంద్రకు క్యాచ్ గా దొరికిపోయాడు. రచిన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో 35 పరుగులు చేసి డుప్లెసిస్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రజత్ పటిదారు మరోసారి నిరాశపరిచాడు. అదే ఓవర్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. రజత్ పటిదార్ పెవిలియన్ కు చేరిన తర్వాత గ్లెన్ మ్యాక్స్ వెల్ క్రీజులోకి వచ్చాడు. అయితే, మ్యాక్స్ వెల్ కూడా తొలి బంతికే దీపక్ చాహార్ బౌలింగ్ లో ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
All Happening Here!
Faf du Plessis ✅
Rajat Patidar ✅
Glenn Maxwell ✅ bounced back & in some style 👏 👏 are 3 down for 42 in 6 overs!
Head to and to watch the match LIVE
Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y |… pic.twitter.com/tyBRQJDtWY
దీంతో వరుసగా రెండో ఓవర్లలోనే బెంగళూరు టీమ్ 3 వికెట్లు కోల్పోయింది. బెంగళూరు టీమ్ 5.3 ఓవర్లలో42 పరుగులు చేసి కీలకమైన డుప్లెసిస్, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్ వెల్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 77 పరుగుల వద్ద కింగ్ కోహ్లీ వికెట్ ను కూడా కోల్పోయింది. విరాట్ కాస్త నెమ్మదిగా ఆడుతూ వేగం పెంచే క్రమంలో 21 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అదే ఓవర్ లో 5వ వికెట్ ను కూడా బెంగళూరు టీమ్ కోల్పోయింది. ముస్తాఫిజుర్ రెహమాన్ 2 ఓవర్లు పూర్తి కాకముందే 4 వికెట్లు తీసి బెంగళూరు టీమ్ ను దెబ్బతీశాడు.
Must-watch Fizur! 🔥🔥 🦁💛
pic.twitter.com/STh4WsZ8EU
CSK vs RCB: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని ధోని ఎందుకు వదులుకున్నాడు?