CSK vs RCB: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని ధోని ఎందుకు వదులుకున్నాడు?
Why did MS Dhoni give up the captaincy: ఐపీఎల్ 2024 ప్రారంభానికి ఒక రోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు చేదు వార్తను చెప్పింది. అదే కెప్టెన్సీ నుంచి ఎంఎస్ ధోని తప్పుకోవడం. కొత్తగా చెన్నై సారథిగా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు.
MS Dhoni : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 17వ సీజన్ ప్రారంభానికి కౌంట్ డౌన్ షురూ అయింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ కు వేదిక కానుంది. తొలి మ్యాచ్‌లో ఐపీఎల్‌లో అత్యంత క్రేజ్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బాలీవుడ్ తారల ప్రదర్శనలతో ఐపీఎల్ 2024 గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ తర్వాత చెన్నై, ఆర్సీబీ మధ్య మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.
ఐపీఎల్ 2024 ప్రారంభానికి ఒక రోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు చేదు వార్తను చెప్పింది. అదే కెప్టెన్సీ నుంచి ఎంఎస్ ధోని తప్పుకోవడం. కొత్తగా చెన్నై సారథిగా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. ఎంఎస్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం చెన్నై అభిమానులే కాకుండా క్రికెట్ లవర్స్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే ధోనీ కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకున్నాడు అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్.. ఐదు సార్లు ఐపీఎల్ టైటిళ్లను చెన్నై అందించాడు. అయితే, ఎందుకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడనే కారణాలు గమనిస్తే..
ఆ తప్పులు చేసింది ఎంఎస్ ధోని.. రోహిత్ కాదు.. !
గత ఐపీఎల్ సీజన్‌లోనే ఎంఎస్ ధోనీ మరింత అలసిపోయి కనిపించాడు. అయితే ఇప్పటికీ అతను ఫిట్‌గానే ఉన్నాడు. అయితే, కొత్త టాలెంట్‌ను అనుమతించడమే ధోనీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. దీంతోనే ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్. ముఖ్యంగా ఆయన నాయకత్వం నుంచి తప్పుకున్నారు కానీ, ధోనీ ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడనే ప్రశ్న కూడా తలెత్తింది. ఇంతకుముందు, ఐపీఎల్ ప్రారంభానికి ముందు ధోనీ కొత్త సీజన్, కొత్త బాధ్యత అంటూ ట్వీట్ చేశాడు. ఇది చూస్తే ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ప్లేయింగ్ 11లో ధోని పేరు వచ్చే వరకు అభిమానుల టెన్షన్ తగ్గలేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మెంటార్‌గా ధోనీ కొనసాగడంపై సందేహం నెలకొంది. అయితే కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవడం క్రికెట్ లవర్స్ ను షాక్ కు గురిచేసింది. అతని అభిమానులను తీవ్రంగా బాధించింది.
ఐపీఎల్ 2024: ఆరు జట్లకు కొత్త సారథులు.. 10 జట్ల కెప్టెన్లు వీరే.. !
- BCCI
- Bangalore Team
- CSK
- Chennai
- Chennai Super Kings
- Cricket
- Dhoni who gave up the captaincy
- Dhoni's captaincy
- Games
- IPL
- IPL 2024
- Indian Premier League
- Indian Premier League 17th Season
- MS Dhoni
- Mahendra Singh Dhoni
- Rohit Sharma
- Royal Challengers Bangalore
- Ruthuraj Gaikwad
- Sports
- Tata IPL
- Tata IPL 2024
- Team India
- Virat Kohli
- Why did Dhoni give up the captaincy?