RCB vs CSK: ధోని vs కోహ్లీ.. బిగ్ ఫైట్.. టాస్ గెలిచిన బెంగళూరు

By Mahesh Rajamoni  |  First Published Mar 22, 2024, 7:50 PM IST

RCB vs CSK: ఐపీఎల్ 2024లో బాలీవుడ్ తార‌ల అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఫుల్ జోష్ నింపారు. తొలి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ టీమ్ బెంగ‌ళూరు, ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డుతున్నాయి.
 


IPL Opening Ceremony Live: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2024) 17వ సీజన్ ఘ‌నంగా ప్రారంభం అయింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జ‌రిగిన ఐపీఎల్ 2024 ప్రారంభ వేడ‌క‌ల్లో బాలీవుడ్ స్టార్లు అక్ష‌య్ కుమార్, టైగ‌ర్ ష్రాఫ్ లు త‌మ డాన్సుల‌తో దుమ్మురేపారు. అలాగే, మ్యూజిక్ లెజెండ్స్ ఏఆర్ రెహ్మాన్, సోను నిగమ్ లు త‌మ అద్భుత‌మైన గాత్రంలో మ‌రోసారి మైమ‌ర‌పించారు. ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో  చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు  టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది.

పిచ్ రిపోర్ట్: 

Latest Videos

స్క్వేర్ బౌండరీలు వరుసగా 65 మీటర్లు, 66 మీటర్లు, స్ట్రెయిట్ బౌండరీ 80 మీటర్ల పొడవుగా ఉంటుంది. ఇది గొప్ప వికెట్ గా క‌నిపిస్తోంద‌ని కెవిన్ పీటర్సన్, బ్రియాన్ లారా తమ పిచ్ రిపోర్టులో పేర్కొన్నారు. పిచ్ పై ప‌గుళ్లు ఉన్నాయ‌నీ, బౌన్స్ ఉండే అవ‌కాశ‌ముంద‌ని తెలిపారు. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటార‌ని తెలిపారు.

IPL OPENING CEREMONY: త్రివర్ణ ప‌తాకంతో.. ఆర్మీ క్యాస్టుమ్ స్టైల్లో దుమ్మురేపిన అక్ష‌య్ కుమార్, టైగ‌ర్ ష్రాఫ్

ఇరు జ‌ట్ల ప్లేయింగ్ 11 వీరే.. 

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీప‌ర్), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):

ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్(వికెట్ కీప‌ర్), కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్

CSK vs RCB : ఐపీఎల్ 2024లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఎంఎస్ ధోని-విరాట్ కోహ్లీ.. !

click me!