IPL Opening Ceremony Live: ఐపీఎల్ 2024లో బాలీవుడ్ ఫ్లేవర్ అదిరిపోయింది. ఐపీఎల్ 2024 ప్రారంభ వేడుకలో జాతీయ పతాకంతో ఎంట్రీ ఇచ్చిన అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లు తమ అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టారు. ఏఆర్ రెహ్మాన్, సోను నిగమ్ లు తమ గాత్రంలో మైమరపించారు.
IPL Opening Ceremony Live: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2024) 17వ సీజన్ ఘనంగా ప్రారంభం అయింది. ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ తారలు తమ అద్భుతమైన ప్రదర్శనలతో అదరగొట్టారు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2024 ప్రారంభ వేడకల్లో బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లు తమ డాన్సులతో దుమ్మురేపారు. ముఖ్యంగా అక్షయ్ కుమార్ ఆర్మీ స్టైల్ క్యాస్టుమ్ తో భారత జాతీయ జెండాను పట్టుకుని రోప్ తో కిందకు దిగడం, త్రివర్ణ పతాకాన్ని టైగర్ ష్రాఫ్ కు అందించడం, ఆ తర్వాత జెండాను పట్టుకుని వేదికపై ఉంచి గౌరవ వందనం చేయడం అద్భుతంగా ఉంది.
𝗣𝗼𝘄𝗲𝗿𝗵𝗼𝘂𝘀𝗲 💥 starts the Opening Ceremony with his energetic performance 😍👏 pic.twitter.com/8HsssiKNPO
— IndianPremierLeague (@IPL)అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ల ప్రదర్శన తర్వాత మ్యూజిక్ లెజెండ్స్ ఏఆర్ రెహ్మాన్, సోను నిగమ్ లు రంగంలోకి దిగారు. తమ అద్భుతమైన గాత్రంలో మరోసారి మైమరపించారు.
𝙀𝙡𝙚𝙘𝙩𝙧𝙞𝙛𝙮𝙞𝙣𝙜 ⚡️⚡️
Chennai erupts in joy as leaves his mark at the Opening Ceremony 🥳 pic.twitter.com/TMuedfuvyU
ఇదిలావుండగా, ఐపీఎల్ తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ నిర్వాహకులు ఈ సీజన్‌లో ప్రారంభ క్లాష్‌పై కొంచెం భిన్నమైన వైఖరిని తీసుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ vs రన్నర్స్-అప్ ట్రెండ్‌ను బద్దలుకొడుతూ.. సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లో ఎంఎస్ ధోని టీమ్ vs విరాట్ కోహ్లి టీమ్ లతో మ్యాచ్ ను ఆడిస్తున్నారు.