అప్పుడు.. మా బ్యాగ్‌లు సర్దుకుని ఇంటికి వెళ్తాము.. రిపోర్టర్ ప్రశ్నకు జడేజా సమాధానం..

By team teluguFirst Published Nov 6, 2021, 2:39 PM IST
Highlights

స్కాట్లాండ్‌తో మ్యాచ్ అనంతరం మీడియా ముందుకు వచ్చిన రవీంద్ర జడేజాకు(Ravindra Jadeja).. అక్కడ ఆదివారం అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌కు (Afghanistan vs New Zealand) సంబంధించిన ప్రశ్న ఎదురైంది దీనికి జడేజా అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. 
 

టీ 20 ప్రపంచ కప్‌లో (T20 World Cup) భాగంగా స్కాట్లాండ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయం సాధించిన టీమిండియా.. సెమీ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. స్కాట్లాండ్ జట్టును 85 పరుగులకే అలౌట్ చేసిన టీమిండియా.. స్వల్ప లక్ష్యాన్ని 39 బంతుల్లోనే పూర్తి చేసింది. దీంతో భారీగా నెట్‌ రన్‌ రేట్ పెంచుకుంది. ఈ విధంగా సెమీస్‌పై ఆశలను సజీవం చేసుకుంది. అయినప్పటికీ భారత్ సెమీఫైనల్ చేరాలంటే.. ఆదివారం న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్‌ల మధ్య జరిగే మ్యాచ్ (Afghanistan vs New Zealand) ఫలితంపై ఆధారపడాల్సి వస్తుంది. ఆ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ గెలిస్తేనే టీమిండియాకు సెమీస్ మార్గం సుగమవుతుంది. న్యూజిలాండ్ గెలిస్తే.. టీమిండియా సెమీస్ ఆశలకు తెర పడినట్టే.

Also read: T20 worldcup:ఇదీ కోహ్లీ అంటే.. స్కాట్లాండ్ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి మరీ..!

ఈ క్రమంలోనే టీమిండియా ఫ్యాన్స్.. ఆదివారం మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. స్కాట్లాండ్‌తో మ్యాచ్ అనంతరం మీడియా ముందుకు వచ్చిన రవీంద్ర జడేజాకు(Ravindra Jadeja).. అక్కడ ఆదివారం అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ‘న్యూజిలాండ్‌ను ఆఫ్ఘనిస్తాన్ ఓడిస్తే.. అప్పుడు మాత్రమే మనకు అవకాశం ఉంది. అయితే న్యూజిలాండ్‌ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించలేకపోతే..?’ అని ఒక విలేకరి జడేజాను ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన జడేజా.. ‘తో ఫిర్ బ్యాగ్ ప్యాక్ కర్కే ఘర్ జాయేంగే, ఔర్ క్యా (అప్పుడు.. మేము మా బ్యాగ్‌లు సర్దుకుని ఇంటికి వెళ్తాము, ఇంకేం ఉంటుంది) ’ అని అన్నాడు. దీంతో అక్కడున్న వారు అంతా సరదాగా నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Also read: T20 World Cup: 39 బంతుల్లోనే లక్ష్యాన్ని చేధించిన భారత్.. నెట్ రన్‌రేట్ మాములుగా పెరగలేదుగా..

టీమిండియా సెమీస్ అవకాశాలు..
ప్రస్తుతం గ్రూప్ 2 నుంచి పాకిస్తాన్ జట్టు సెమీస్‌ బెర్త్ కన్‌ఫామ్ చేసుకుంది. అయితే మరో స్థానం కోసం టీమిండియా, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ జట్లు పోటి పడుతున్నాయి. గ్రూప్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 4 గెలుపొందిన పాకిస్తాన్.. 8 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఇక, న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు నెట్ రన్‌ రెట్ +1.277గా ఉంది. రెండు విజయాలతో 4 పాయింట్లు సాధించిన టీమిండియా +1.619తో మూడో స్థానంలో ఉంది. అఫ్గానిస్తాన్ కూడా రెండు మ్యాచ్‌లో విజయం సాధించి.. 4 పాయింట్లు ఖాతాలో వేసుకున్నప్పటికీ.. +1.481 NRR టీమిండియా కంటే తక్కువగా ఉండటంతో గ్రూప్‌లో 4వ స్థానంలో కొనసాగుతుంది. 

 

"Toh phir aur bag pack karke ghar jayenge, aur kya"😂🤣 pic.twitter.com/V6DE71UcM0

— Jayesh (@jayeshvk16)

ఇక, భారత జట్టు సెమీస్‌కు చేరాలంటే.. ఆదివారం న్యూజిలాండ్‌పై అఫ్గాన్ జట్టు విజయం సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా 8వ తేదీన నమీబియాపై భారత జట్టు గెలుపొందాలి. ఈ రెండు జరిగితే నెట్ రన్‌ రేట్ అధికంగా ఉండటంతో భారత్‌కు సెమీస్‌లో బెర్త్ లభిస్తుంది.

ఆదివారం జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై అఫ్గాన్ గెలిచి.. నమీబియాపై ఇండియా ఓడిపోతే.. అఫ్గాన్ జట్టుకు సెమీస్‌‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం నెట్ రన్‌రేట్ పరంగా న్యూజిలాండ్ కన్నా అఫ్గానిస్తాన్ మెరుగైన స్థితిలో ఉంది. ఇలా కాకుండా ఆదివారం మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై న్యూజిలాండ్ నెగ్గితే.. 8 పాయింట్లతో సెమీస్‌కు బెర్త్ ఖాయం చేసుకుంటుంది. దీంతో ఆదివారం జరిగనే మ్యాచ్ అఫ్గానిస్తాన్ విజయం సాధించాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

click me!