Ravindra Jadeja Drives Bullock Cart: 'వింటేజ్ రైడ్' లో జడ్డూ భాయ్ అదరగొట్టాడు. ఎద్దుల బండిని నడుపుతున్న రవీంద్ర జడేజా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Ravindra Jadeja Drives Bullock Cart: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. జడ్డూ భాయ్ ఎద్దుల బండిపై స్వారీ చేస్తున్న వీడియో సోషల్ మీడియా హల్ చల్ చేస్తోంది. నెట్టింట వైరల్ గా మారిన ఆ వీడియోలో.. రవీంద్ర జడేజా ఎద్దుల బండిని నడుపుతున్నాడు. ఆ వీయోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ 'వింటేజ్ రైడ్' అంటూ పేర్కొన్నాడు. ఇక దీనిపై కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇప్పటివరకు 790,418 లైక్స్ రాగా, 4 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. ఆ వీడియో మీరు చూసేయండి మరి.. !
MS DHONI: హుక్కా పీలుస్తూ.. ధోనీ వీడియో వైరల్.. కెప్టెన్ కూల్ పై విమర్శలు