Vaibhav Suryavanshi: 12 ఏండ్ల‌కే వైభవ్ సూర్యవంశీ రంజీ ఎంట్రీ, స‌చిన్ స‌హా దిగ్గ‌జాల రికార్డులు బ్రేక్

By Mahesh Rajamoni  |  First Published Jan 6, 2024, 4:06 PM IST

Vaibhav Suryavanshi: బీహార్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ 12 ఏళ్ల వయసులో రంజీ అరంగేట్రం చేసి చ‌రిత్ర సృష్టించాడు. ఈ యంగ్ ప్లేయ‌ర్ ను బీహార్ 'సచిన్ టెండూల్కర్' అని పిలుస్తున్నారు. రంజీ ఎంట్రీతో దిగ్గ‌జ క్రికెట‌ర్ల రికార్డుల‌ను బ్రేక్ చేశాడు.
 


Ranji Trophy 2024 - Vaibhav Suryavanshi : రంజీ ట్రోఫీ 2024 సీజన్ లో బీహార్ యంగ్ ప్లేయ‌ర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసి చ‌రిత్ర సృష్టించాడు. అరంగేట్రం  చేయ‌డం తో చ‌రిత్ర సృష్టించ‌డం ఏమిటీ? అనుకుంటున్నారా? అక్క‌డే ఉంది స్పెష‌ల్ మ‌రి.. ! 'సచిన్ టెండూల్కర్ ఆఫ్ బీహార్' అని పిలుచుకునే ఈ యంగ్ ప్లేయ‌ర్ వ‌య‌స్సు 12 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే. 12 ఏండ్ల వ‌య‌స్సులో రంజీ క్రికెట్ లోకి ఏంట్రీ ఇచ్చి దిగ్గ‌జ క్రికెట‌ర్ల రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. 

రంజీ ట్రోఫీ 2023-24 కొత్త సీజన్ ప్రారంభమైంది. భారత క్రికెట్ కు చెందిన పలువురు దిగ్గజాలు మైదానంలో అడుగుపెట్టారు. ఇదిలా ఉంటే బీహార్ కు చెందిన వైభవ్ సూర్యవంశీ 12 ఏళ్ల వయసులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేయ‌డంతో అత‌ని పేరు హాట్ టాపిక్ గా మారింది. పాట్నాలో ముంబైతో రంజీ ట్రోఫీ గ్రూప్-బి మ్యాచ్ ఆడేందుకు బీహార్ జట్టు వెళ్లింది. ఈ మ్యాచ్ ద్వారా వైభవ్ రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. 

Latest Videos

undefined

T20 WORLD CUP 2024: టీ20 వరల్డ్ కప్ లో భారత్ లీగ్ మ్యాచ్ లన్నీ యూఎస్ఏ లోనే ఎందుకు?

వైభవ్ ను 'సచిన్ టెండూల్కర్ ఆఫ్ బీహార్' అని పిలుస్తుంటారు. సచిన్ టెండూల్కర్ ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసినప్పుడు అతని వయస్సు 15 సంవత్సరాల 232 రోజులు..  అయితే, వైభవ్ రంజీలోకి 12 ఏళ్ల 9 నెలల 10 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు. దీంతో స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. త‌క్కువ వ‌య‌స్సులో రంజీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్లేయ‌ర్ గా మారాడు. అయితే, అత‌నికి సంబంధించిన ఒక పాత వీడియో వైర‌ల్ అవుతోంది. దాదాపు 8 నెలల క్రితం వైభవ్ పాత ఇంటర్వ్యూలో (2023 సెప్టెంబర్ 27) తనకు 14 ఏళ్లు నిండనున్నాయని వైభవ్ స్వయంగా అందులో చెప్ప‌డం క‌నిపించింది. దీని ప్రకారం, రంజీలోకి అరంగేట్రం సమయంలో అతని వయస్సు 14 సంవత్సరాల 3 నెలల 9 రోజులు. కానీ బీసీసీఐ అధికారిక వెబ్ సైట్ లో12 ఏండ్లుగా పేర్కొంది.

బీహార్ లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ ఎడమచేతి వాటం ఓపెనర్. కేవలం ఆరేళ్ల వయసు నుంచే బ్యాట్ ప‌ట్టిన అత‌ను ఏడేళ్లలో క్రికెట్ అకాడమీలో చేరాడు. మాజీ రంజీ క్రికెటర్ మనీష్ ఓజా వద్ద శిక్షణ పొందాడు. భారత అండర్-19 బీ జట్టులో సభ్యుడిగా ఉన్న అతను ఐదు మ్యాచ్ ల‌లో 177 పరుగులు చేశాడు. గత సీజన్ లో వినూ మన్కడ్ ట్రోఫీలో 5 మ్యాచ్ ల‌ను ఆడిన‌ వైభవ్ 393 పరుగులు చేశాడు. అండర్-19 జట్టు బెహర్ ట్రోఫీకి కూడా ఆడాడు. పాకిస్తాన్ కు చెందిన అలీముద్దీన్ కూడా 12 వ‌య‌స్సులో ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు.

వారం రోజుల్లో బరువు తగ్గొచ్చా..? ఎలా సాధ్యం..? 

సూర్యవంశీ అసలు వయసు 12 అయితే నేటి రంజీ ట్రోఫీ సిరీస్ ద్వారా రంజీ ట్రోఫీ ఆడిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టిస్తాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన నాలుగో పిన్న వయస్కుడిగా నిలిచాడు.  1942-43లో 12 ఏళ్ల 73 రోజుల వయసులో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసి రాజపుతానా తరఫున ఆడిన అలీముద్దీన్ పేరిట ఈ రికార్డు ఉంది. అయితే, బైభవ్ సూర్వవంశీ వయస్సు విషయంలో పలు వివాదాలు ఉన్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. 

click me!