MS Dhoni: హుక్కా పీలుస్తూ.. ధోనీ వీడియో వైర‌ల్.. కెప్టెన్ కూల్ పై విమ‌ర్శ‌లు

By Mahesh Rajamoni  |  First Published Jan 7, 2024, 11:46 AM IST

MS Dhoni Smoking Hookah: భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని సంబంధించిన ఒక ప్ర‌యివేటు వీడియో వైర‌ల్ గా మారింది. అందులో ధోని హుక్కా పీలుస్తూ క‌నిపించ‌డంతో.. మిస్ట‌ర్ కూల్ పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 
 


Viral Video Shows MS Dhoni Smoking Hookah: భార‌త క్రికెట్ జ‌ట్లు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన త‌ర్వాత కూడా ఆయ‌న‌కున్న క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ప్ర‌స్తుతం ఐపీఎల్ చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ఎంఎస్ ధోని.. నిత్యం ఏదో ఒక అంశంతో వార్తాల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయ‌న‌కు సంబంధించిన ఒక వీడియో వైర‌ల్ అవుతోంది. ఇదే క్ర‌మంలో కెప్టెన్ కూల్ ధోనిపై విమ‌ర్శ‌లు కూడా రావ‌డం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

ధోనికి సంబంధించిన ఒక ప్ర‌యివేటు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. ఆ వీడియోలో ధోని హుక్కా పీలుస్తూ క‌నిపించాడు. సంబంధిత దృశ్యాలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. దీనిపై భిన్న‌మైన కామెంట్స్ వ‌స్తున్నాయి. విమ‌ర్శ‌లు చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఇదే క్ర‌మంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ సహచరుడు జార్జ్ బెయిలీ చేసిన వ్యాఖ్య‌లు కూడా వైర‌ల్ అవుతున్నాయి. ``ధోనీకి కొంచెం షీషా.. హుక్కా పీల్చ‌డం ఇష్టం. ధోనీ గదిలో హుక్కా సెటప్ కూడా త‌ర‌చు క‌నిపించేది. ధోని  దాచుకోవాలని అనుకునే వాడు కాదు.. ధోనీ హుక్కా పీలుస్తున్నప్పుడు.. యంగ్ ప్లేయ‌ర్స్ కూడా సరదాగా కూర్చుంటారంటూ పేర్కొన్నాడు.

Latest Videos

 

M S Dhoni Smoking 😳😳😳

pic.twitter.com/5hgawTTZjh

— Dr. Ladla 🇮🇳 (@SonOfChoudhary)

అయితే, ధోని హుక్కా పీలుస్తున్న వీడియో ఒక ఫంక్ష‌న్ లో జ‌రిగిందిగా క‌నిపిస్తోంది. కానీ, దీనిని ఎప్పుడు, ఎక్క‌డ చిత్రీకరించారనేది తెలియ‌దు. కానీ ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారీ, హాట్ టాపిక్ అయింది.

T20 WORLD CUP 2024: ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్.. ఐసీసీ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదు.. !

click me!