IND vs ENG: చ‌రిత్ర సృష్టించిన అశ్విన్.. దిగ్గ‌జాల రికార్డులు బ్రేక్.. !

By Mahesh RajamoniFirst Published Feb 16, 2024, 6:56 PM IST
Highlights

India vs England: భారత స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రాజ్‌కోట్ టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ టెస్టు క్రికెట్ లో 500 వికెట్లు పూర్తి చేశాడు. ఈ క్ర‌మంలోనే దిగ్గ‌జ బౌల‌ర్ల రికార్డుల‌ను బ్రేక్ చేశాడు. 
 

India vs England - Ravichandran Ashwin : భారత్‌-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రాజ్‌కోట్‌ టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్, ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో ఒక వికెట్ తీయ‌డంతో అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ రెండో రోజు ఇంగ్లాండ్ బ్యాట‌ర్ జాక్ క్రౌలీని అవుట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ చారిత్రాత్మక ఫీట్ సాధించాడు. టెస్టుల్లో 500 వికెట్లు సాధించిన రెండో భారత క్రికెట‌ర్ గా రవిచంద్రన్ అశ్విన్ రికార్డు సృష్టించాడు. 

టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 500 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. 98వ టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 500 వికెట్లు తీసిన రికార్డు 87వ టెస్టులో ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది. భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే 105 టెస్టుల్లో ఈ రికార్డును సాధించగా, దివంగత ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ తన 108వ టెస్టులో ఈ రికార్డు సృష్టించాడు. మొత్తంగా అశ్విన్ అత్యంత‌ వేగంగా 500 వికెట్లు తీయడంలో వార్న్, కుంబ్లేలను అధిగమించాడు.

Latest Videos

అలాగే, అంత‌ర్జాతీయ టెస్టు క్రికెట్ లో 500 వికెట్లు పూర్తి చేసుకున్న ప్రపంచంలో 9వ బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. అలాగే, 500 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఐదో స్పిన్నర్. శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ (800) టెస్టులో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం షేన్ వార్న్ (708) రెండో స్థానంలో, జేమ్స్ అండర్సన్ (695*) మూడో స్థానంలో కొనసాగుతున్నారు. భారత్ తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అనిల్ కుంబ్లే. కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు తీశాడు.

India vs England: ఎంఎస్ ధోని రికార్డు బ్రేక్.. గంగూలీని అధిగ‌మించిన రోహిత్ శ‌ర్మ‌..

టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు 

1. ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక 1992-2010): 133 టెస్టులు – 800 వికెట్లు 

2. షేన్ వార్న్ (ఆస్ట్రేలియా 1992-2007): 145 టెస్టులు – 708 వికెట్లు

3. జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్ 2003-2023): 185* టెస్టులు - 696* వికెట్లు

4. అనిల్ కుంబ్లే (భారత్ 1990-2008): 132 టెస్టులు – 619 వికెట్లు

5. స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్ 2007-2023): 167 టెస్టులు – 604 వికెట్లు

6. గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా 1993-2007): 124 టెస్టులు - 563 వికెట్లు

7. కోర్ట్నీ వాల్ష్ (వెస్టిండీస్ 1984-2001): 132 టెస్టులు - 519 వికెట్లు

8. నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా 2011-2023): 127* టెస్టులు - 517* వికెట్లు

9. రవిచంద్రన్ అశ్విన్ (భారత్ 2011-2023): 98* టెస్ట్ – 500* వికెట్లు

కాగా, తమిళనాడుకు చెందిన ర‌విచంద్ర‌న్ అశ్విన్ 2011 నవంబర్‌లో ఢిల్లీలో వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టీమిండియాలో స్టార్ బౌల‌ర్ గా ఎదిగాడు. టెస్టుల్లో అతను 24 కంటే తక్కువ సగటుతో వికెట్లు తీశాడు. అశ్విన్ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు 34 సార్లు సాధించాడు. అలాగే, ఒక మ్యాచ్‌లో ఎనిమిది సార్లు 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు.

IND vs ENG: 146 kmph బౌన్స‌ర్.. సిక్సు కొట్టిన ప్లేయ‌ర్.. ధృవ్ జురెల్ తో పెట్టుకుంటే అంతే మ‌రి.. !

click me!