IPL 2024: ఆర్సీబీకి బిగ్ షాక్.. విరాట్ కోహ్లీ ఐపీఎల్ కు దూరం కానున్నాడా?

By Mahesh Rajamoni  |  First Published Feb 27, 2024, 10:06 AM IST

Will Virat Kohli play IPL 2024 : టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఇటీవల ఇంగ్లాండ్ తో  జరిగిన టెస్టు సిరీస్ కు దూర‌మ‌య్యాడు. ప్రస్తుతం విరుష్క దంప‌తులు రెండో సంతానంతో స‌మ‌యం గ‌డుపుతున్నారు. దీంతో రానున్న ఐపీఎల్ 2024 లో కోహ్లీ ఆడ‌టం గురించి సునీల్ గ‌వాస్క‌ర్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.
 


Will Virat Kohli play IPL 2024: వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ త‌ప్పుకున్నాడు. విరాట్ కోహ్లీ-అనుష్క శ‌ర్మ దంప‌తులు ఇటీవ‌లే పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. దీంతో వారికి ఇప్పుడు వామికాతో పాటు అకాయ్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. విరుష్క దంప‌తులు ఇప్పుడు వారితో స‌మ‌యం గ‌డుపుతున్నారు. ప్ర‌స్తుతం లండ‌న్ లో ఉన్న విరాట్ కుటుంబం త్వ‌ర‌లోనే భార‌త్ కు చేరుకోనుంది. ప్ర‌స్తుతం క్రికెట్ దూరంగా ఉన్న కోహ్లీ.. రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో పాల్గొనడంపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశ్నలు సంధించాడు. మార్చి 22న చెపాక్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో తలపడనున్నాయి.

భార‌త్-ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ ల‌ టెస్టు సిరీస్ లో తొలి రెండు టెస్టులకు జట్టులో చోటు దక్కించుకున్న విరాట్ కోహ్లీ హైదరాబాద్ లో తొలి మ్యాచ్ కు ముందే వైదొలిగాడు. ఈ నెల ప్రారంభంలో విరాట్, అతని భార్య అనుష్క శర్మ తమ రెండవ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్ర‌మంలో ఆట‌కు దూరంగా విరాట్ కోహ్లీ గురించి సునీల్ గ‌వాస్క‌ర్ ను ప్ర‌శ్నించ‌గా, "క్యా వో ఖేలెంగ్? కుచ్ రీజన్ కే లియే ఖేల్ నహీం రహే హైం, షాయాద్ హో సక్తా హై కే ఐపీఎల్ కే లియే భీ నా ఖేలే (అతను ఆడతాడా? కొన్ని కారణాల వల్ల అతను ఆడటం లేదు, బహుశా కోహ్లీ ఐపీఎల్ లో కూడా ఆడకపోవచ్చు" అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌స్తుతం గ‌వాస్క‌ర్ కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. ఇదే స‌మ‌యంలో కోహ్లీ అభిమానులు, క్రికెట్ ల‌వ‌ర్స్ నిరాశ‌ను వ్య‌క్తం చేస్తున్నారు. అలా జ‌ర‌గ‌కూడ‌ద‌నీ, కోహ్లీ ఆడాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Latest Videos

undefined

Yashasvi Jaiswal: 92 ఏళ్లలో ఇదే తొలిసారి..! య‌శ‌స్వి జైస్వాల్ స‌రికొత్త చ‌రిత్ర !

అలాగే, రాజస్థాన్ రాయల్స్ జ‌ట్టులో కొన‌సాగుతున్న భార‌త‌ వికెట్ కీపర్-బ్యాట్స్ మ‌న్ ధృవ్ జురెల్ ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగే అవకాశం ఉందని గవాస్కర్ అన్నారు. కేవలం రెండో టెస్టు మ్యాచ్ ఆడుతున్న జురెల్ రాంచీ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 90 పరుగలు, రెండో ఇన్నింగ్స్ లో 39 పరుగులు చేసి ఇంగ్లాండ్ పై భారత్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న విష‌యాన్ని గుర్తు చేశారు. "అతనికి త‌న స్థానంలో ముందుకు సాగ‌వ‌చ్చు. టెస్టు మ్యాచుల్లో ఈ ప్రదర్శన తర్వాత జురెల్ సూపర్ స్టార్ కావచ్చు. ఆకాశ్ దీప్ కూడా ఆర్సీబీలో మరింత ఎక్స్పోజింగ్ పొంది, గత సీజన్ లొ కోల్పోయిన డెత్ ఓవర్ స్పెషలిస్ట్ పాత్రను పోషించగలడు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా చేసిన ముంబై ఇండియన్స్ గేమ్ ప్లాన్ ను ప్రశంసించారు. జట్టును నడిపించే అదనపు బాధ్యత లేకుండా రోహిత్ శర్మ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి మార్గం సుగమం చేశార‌ని" గ‌వాస్క‌ర్ తెలిపారు.

Rohit Sharma: టెస్టు క్రికెట్ లో హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ మ‌రో రికార్డు.. !

click me!