అండర్-19 ప్రపంచకప్.. ఆటగాళ్ల అతి, ఐసీసీ సీరియస్: రవి బిష్ణోయ్ తండ్రి ఉద్వేగం

By Siva KodatiFirst Published Feb 12, 2020, 6:49 PM IST
Highlights

అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌ ముగిసిన తర్వాత విజయోత్సవ సంబరాల్లో భాగంగా బంగ్లాదేశ్ ఆటగాళ్లు అతి చేసిన సంగతి తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లను దూషించడంతో పాటు ఏకంగా వాళ్లను కొట్టేందుకు మీదకు వెళ్లారు

అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌ ముగిసిన తర్వాత విజయోత్సవ సంబరాల్లో భాగంగా బంగ్లాదేశ్ ఆటగాళ్లు అతి చేసిన సంగతి తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లను దూషించడంతో పాటు ఏకంగా వాళ్లను కొట్టేందుకు మీదకు వెళ్లారు.

ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణా మండలి క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ నుంచి తౌహిద్ హృదయ్, షమీమ్ హుస్సేన్, రకీబుల్ హుస్సేన్.. భారత్ నుంచి రవి బిష్ణోయ్, ఆకాశ్ సింగ్‌లపై సస్పెన్షన్ వేటు వేసింది.

Also Read:అండర్ 19 ఫైనల్స్ లో అతి: ఆ ఐదుగిరిపై ఐసీసీ సీరియస్

ఈ క్రమంలో రవి బిష్ణోయ్ తండ్రి మంగిలాల్ బిష్ణోయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటారని.. అతనిపై వస్తున్న ఆరోపణలను విని తాను ఆశ్చర్యపోయానని తెలిపారు.

బంగ్లా ఆటగాళ్లు టీమిండియా ఆటగాళ్లపై దాడి చేస్తున్న సందర్భంలో సహచరుడిని కాపాడే క్రమంలోనే రవి ఆవేశానికి లోనైనట్లు తెలిపారు. ఈ ఘటన జరిగిన తర్వాత తన భార్య భోజనం కూడా చేయలేదని మంగిలాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:మా వాళ్లు అతి చేశారు.. క్షమించండి: బంగ్లా కెప్టెన్ అక్బర్ అలీ

నరాల తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్‌లలో క్రీడాకారులు భావోద్వేగానికి లోనవ్వడం సహజమన్నారు. అయితే ఆటగాళ్లు ఒకరినొకరు గౌరవించుకుంటూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని మంగిలాల్ సూచించారు.

అటు ఆటగాళ్ల అతిపై సీరియస్‌గా స్పందించిన ఐసీసీ ఆకాశ్ సింగ్‌కు 8 సస్పెన్షన్ పాయింట్లు, రవి బిష్ణోయ్‌కి 5 సస్పెన్షన్ పాయింట్లు విధించిన సంగతి తెలిసిందే. అటు బంగ్లా ఆటగాళ్లు తౌహిత్ హృదయ్‌పై 10, షమీమ్ హుస్సేన్ 8, రకీబుల్ హసన్ 4 సస్పెన్షన్ పాయింట్లు విధించింది. కాగా అండర్‌-19 ప్రపంచకప్‌ మొత్తం అద్భుతంగా రాణించిన రవి బిష్ణోయ్ 17 వికెట్లు పడగొట్టాడు.

click me!