టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కాంట్రాక్ట్ ముగిసింది. అయితే మరి కొన్ని నెలల్లో టీ20 వరల్డ్ కప్ రాబోతోంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ కోసం బీసీసీఐ (BCCI) అన్వేషణ సాగిస్తోంది. రాహుల్ వారసుడిగా ఎవరు వచ్చే అవకాశం ఉందంటే ?
ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్( Cricket World Cup 2023) ముగిసింది. ఇందులో ఆస్ట్రేలియా టీమ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ముగిసిన నాటి నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India -BCCI) బిజీ అయిపోయింది. భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ కు జట్టును ప్రకటించడం, ఐపీఎల్ రిటెన్షన్, విడుదల తేదీ వంటివి చూసుకోవడంలో నిమగ్నయ్యింది. దీంతో పాటు టీమ్ ఇండియా హెడ్ కోచ్ గురించి కూడా చర్చలు జరుపుతోంది.
Birth Day: బర్త్ డేకు దుబాయ్ తీసుకెళ్లలేదని భార్య పిడిగుద్దులు.. ముక్కు పగిలి భర్త మరణం
ఇటీవల జరిగిన ప్రపంచ కప్ తో పదవీకాలం పూర్తి చేసుకున్న బోర్డు, రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid)ల భవిష్యత్తు ఏమిటనే దానిపై నిరంతరం చర్చలు జరుగుతున్నాయని ‘ఇండియా టుడే’ నివేదించింది. అలాగే ఆయన పదవి కాలం పొడిగించే బదులు కొత్త కోచ్ నే నియమించుకోవాలని బీసీసీఐ ఆసక్తి చూపుతున్నట్టు ఆ మీడియా సంస్థ కథనం పేర్కొంది.
‘‘రాహుల్, బీసీసీఐ మధ్య ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపై చర్చలు జరిగాయి. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తాం. టీ20 వరల్డ్ కప్ కు మరో 7-8 నెలల సమయం ఉన్న నేపథ్యంలో కొత్త కోచ్ వచ్చి జట్టును నిర్మించి, సెట్ చేయడానికి సమయం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆ విషయం ద్రవిడ్ కు బాగా తెలుసు’ అని బీసీసీఐ అధికారి ఒకరు ‘పీటీఐ’తో తెలిపారు.
గత కొన్నేళ్లుగా టీమ్ మూడు ఐసీసీ ట్రోఫీల్లో ఒక్కటి కూడా గెలవలేకపోయినప్పటికీ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును మేనేజ్ చేసిన తీరుపై బీసీసీఐ సంతృప్తి వ్యక్తం చేసింది. కాబట్టి అన్ని పరిస్థితులను, కోణాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు.
బర్త్ డే రోజు దుబాయ్ తీసుకెళ్లలేదని దారుణం.. భర్తను ముక్కుపై గుద్ది చంపిన భార్య..
కాగా.. గతేడాది జింబాబ్వే, ఈ ఏడాది ఆరంభంలో ఐర్లాండ్ లో జట్టుతో కలిసి పర్యటించిన ఎన్ సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో పాల్గొంటున్న యువ జట్టుకు ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు. జట్టుతో పాటు ఆటగాళ్ల ఇన్ అండ్ అవుట్లు కూడా ఆయనకు తెలుసు. కాబట్టి రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ ను పొడగించకపోతే కొత్త కోచ్ గా లక్ష్మణ్ నియామకం అయ్యే అవకాశం కనిపిస్తోంది.