రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని భారత క్రికెట్ జట్టు సభ్యుడు మహమ్మద్ షమీ రక్షించాడు. ఈ విషయమై షమీ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశారు.
న్యూఢిల్లీ: నైనిటాల్ సమీపంలో కారు ప్రమాదానికి గురైన వ్యక్తిని భారత క్రికెట్ జట్టు సభ్యుడు మహమ్మద్ షమీ రక్షించాడు.ప్రపంచకప్ పురుషుల క్రికెట్ మ్యాచ్ 2023 లో పాల్గొన్న స్టార్ ఇండియన్ పేసర్ హిల్ స్టేషన్ కు వెళ్తున్న సమయంలో కొండపై కారు పడిపోవడం చూశాడు. వెంటనే ప్రమాదానికి గురైన వ్యక్తిని రక్షించాడు.
శనివారం నాడు రాత్రి మహమ్మద్ షమీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ విషయాన్ని పోస్టు చేశారు. నైనిటాల్ సమీపంలో కారు ప్రమాదానికి గురైన వ్యక్తికి సహాయం చేస్తున్న వీడియోను పోస్టు చేశారు.
అతను చాలా అదృష్టవంతుడు. దేవుడు అతనికి రెండో జీవితాన్ని ఇచ్చాడు. అతని కారు నైనిటాల్ సమీపంలోని కొండ రహదారి నుండి పడిపోయింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన తాము అతడిని రక్షించినట్టుగా మహమ్మద్ షమీ చెప్పారు.
ప్రపంచ కప్ పురుషుల క్రికెట్ 2023 పోటీల్లో మహమ్మద్ షమీ అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. ప్రపంచకప్ లో జరిగిన షమీ ఆడిన మ్యాచ్ ల్లో 24 వికెట్లు తీశాడు. ప్రపంచకప్ లోని తొలి నాలుగు మ్యాచ్ లకు మమహ్మద్ షమీ దూరంగా ఉన్నాడు. అయితే న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో మహమ్మద్ షమీ ఆడాడు.ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు ఐదు వికెట్లు తీసి ఆ జట్టు వెన్ను విరిచాడు.
also read:mohammed shami... భారత ఆటగాళ్లకు మోడీ ఓదార్పు: సోషల్ మీడియాలో పంచుకున్న మహమ్మద్ షమీ
సెమీ ఫైనల్ లో విరాట్ కోహ్లి వన్ డేలలో 50వ సెంచరీ చేశాడు. మరో వైపు శ్రేయాస్ అయ్యర్ కూడ ప్రపంచ కప్ లో రెండో సెంచరీ చేశారు. అస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో స్పిన్నర్ ఆడమ్ జంపాను అధిగమించి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా షమీ నిలిచాడు. ఈ నెల 19వ తేదీన అస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ప్రపంచకప్ టైటిల్ ను అస్ట్రేలియా ఆరో దఫా దక్కించుకుంది.నైనిటాల్ లో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని కాపాడి మానవత్వానికి మారుపేరుగా మహమ్మద్ షమీ నిలిచారు.