"అలా చేయడం వల్లే.. " ఫైనల్లో టీమిండియా ఓటమిపై పాకిస్థాన్ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు 

By Rajesh Karampoori  |  First Published Nov 26, 2023, 6:21 AM IST

Wasim Akram: ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓటమిపై పాకిస్థాన్ లెజెండరీ క్రికెటర్ వసీం అక్రమ్ విశ్లేషించారు. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ ఆర్డర్ లో పలు మార్పులు చేసిందనీ, అలాగే బ్యాటింగ్ లోపాలను కూడా వెల్లడించారు. 


Wasim Akram: ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌లో టీమిండియా పరాజయంపై క్రీడా ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. వారికి తోచిన విధంగా అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ లెజెండరీ క్రికెటర్ వసీం అక్రమ్ కూడా ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ ఆర్డర్ లో మార్పు చేయడం కూడా టీమిండియా ఓటమికి ఓ కారణమని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు.

ఓపెనింగ్ బౌలింగ్ లో ఎలాంటి  మార్పులు చేయకుండా ఉండాల్సిందని అన్నారు. మహ్మద్ షమీ కంటే ముందు సిరాజ్ బౌలింగ్ చేయాల్సి ఉండేది. రోహిత్ అనుకున్నవిధంగా షమీ, బుమ్రా లు ఆరంభంలోనే మూడు వికెట్లు పడగొట్టింది. కానీ.. ఆ తర్వాత ట్రావిస్ హెడ్, లబుషేన్ ల భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయలేకపోయారు. 

Latest Videos

ఎకనామిక్ స్పెల్స్ బౌలింగ్ చేయగల మహ్మద్ సిరాజ్ సామర్థ్యాన్ని చూస్తుంటే.. మహ్మద్ షమీ కంటే ముందు బౌలింగ్ చేస్తే బాగుండేదని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. సిరాజ్ ప్రపంచకప్ అంతటా బాగా బౌలింగ్ చేసాడు. ఆసియాకప్, ప్రపంచకప్ టోర్నీలలో అతని ప్రదర్శనలు టీమిండియా ఫ్యూచర్ స్టార్‌గా నిలబెట్టాయని అభిప్రాయపడ్డారు.

ప్రపంచకప్ ఫైనల్ లాంటి పెద్దమ్యాచ్‌లలో అప్పటి వరకూ విజయవంతమైన సూత్రాలకే జట్లు కట్టుబడి ఉండాలని అభిప్రాయపడ్డాడు. అలాగే షమీ గురించి మాట్లాడుతూ.. ఈ మహా టోర్నీలోని షమీ ఆటతీరు ప్రశంసనీయమన్నారు. ఫైనల్ లో డేవిడ్ వార్నర్‌ను అవుట్ చేసిన తీరు చాలా ఆకట్టుకుందనన్నాడు.   

 
అలాగే.. మిడిల్ ఆర్డర్‌ బ్యాట్స్ మెన్స్  దూకుడుగా ఆడి ఉంటే.. ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయ పడ్డారు.  రోహిత్ శర్మ ఔటైన తీరుపై సైతం అక్రమ్ స్పందించాడు. భారత కెప్టెన్ రోహిత్ ఆటతీరును ప్రశంసిస్తూ.. మొత్తం ప్రపంచకప్‌లో అతని ఇలాగే ఆడుతు మెరుపు ఆరంభాలు ఇచ్చాడన్న వసీం అక్రమ్.. అతను  ఫైనల్ మ్యాచ్ లో 50 పరుగులలోపే అవుట్ అయ్యాడు. కానీ అతను జట్టుకు శుభారంభం ఇచ్చాడు. ఫైనల్‌లో కూడా అతను అదే చేసాడు. స్పిన్‌ను బాగా ఆడే ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో అతను ఒకడని, అతను ఫైనల్‌లో మాక్స్‌వెల్‌కు బలి అయ్యాడని, అయితే రోహిత్ బాగా ఆడాడని తాను అనుకుంటున్నాను. అతనికి ఎటువంటి మార్పు అవసరం లేదని అక్రమ్ అన్నాడు.

మిడిల్ ఆర్డర్ 'డు ఆర్ డై' మనస్తత్వంతో ఆడాలని, మిడిల్ ఓవర్లలో టీమిండియా మరిన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. మిడిలార్డర్ బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడాల్సిందని అన్నాడు. కానీ, కేఎల్ రాహుల్ స్లోగా ఆడటానికి గల కారణాలను తను అర్థం చేసుకోగలనని, రవీంద్ర జడేజా తర్వాత బ్యాట్స్‌మెన్ లేరు. అతను నిలకడగా ఆడవలసి వచ్చిందని అభిప్రాయా పడ్డారు.  

ఫైనల్‌లో మిడిలార్డర్‌కు బ్యాలెన్స్ చేసే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను భారత్ కోల్పోయిందనీ,  హార్దిక్ జట్టులో ఉండి ఉంటే రాహుల్ రిస్క్ తీసుకునే వాడని, రిస్క్ చేసి ఔట్ అయినా కూడా ప్రజలు విమర్శించేవారని అక్రమ్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో భారత్ వేగంగా పరుగులు చేసి ఉంటే మ్యాచ్ చిత్రణ మరోలా ఉండేదని అన్నాడు.  టీ20 ప్రపంచకప్ లో జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఉండాలని, వాళ్లే ప్రధాన ఆటగాళ్లని  వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు.  

click me!