పాకిస్తాన్ కు తేల్చిచెప్పిన టీమిండియా.. ఇప్పుడు ఏం చేస్తారో మరి?

By Mahesh Rajamoni  |  First Published Jul 19, 2024, 8:26 PM IST

Champions Trophy 2025 : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జ‌ర‌గ‌నుంది. మార్చి 10న ఫైన‌ల్ మ్యాచ్ కు రిజ‌ర్వు డే ఉంది. దీనికి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఈ క్ర‌మంలోనే పాకిస్తాన్ కు భార‌త్ గట్టిగానే ఒక విష‌యాన్ని మ‌రోసారి చెప్పింది.. ! 
 


ICC Champions Trophy 2025 : క్రికెట్ ల‌వ‌ర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. వచ్చే ఏడాది ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ ద‌క్కించుకుంది. దీనికి లాహోర్ వేదిక కానున్న నేప‌థ్యంలో పాకిస్థాన్‌ను భార‌త జ‌ట్టు సందర్శిస్తుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మొత్తం టోర్నీని త‌మ‌ సొంతగడ్డపై నిర్వహించాలని నిర్ణయించుకుంది.

మీడియా నివేదికల ప్రకారం.. పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ఈ మెగా టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ వివ‌రాల‌ను, సంబంధిత ఏర్పాట్ల‌ను ఐసీసీకి తెలియజేసింది. అయితే, ఐసీసీ టోర్నీ కోసం భార‌త్ పాకిస్తాన్ వెళ్తుందా? అనేది అతిపెద్ద ప్ర‌శ్న‌. ఎందుకంటే ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు చాలా కాలంగా ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో భార‌త జ‌ట్టు లేకుండా టోర్న‌మెంట్ ను నిర్వ‌హించ‌డానికి ఐసీసీ ముంద‌డుగు వేయ‌డం క‌ష్ట‌మే. 2008 నుంచి భారత్‌ పాక్‌లో పర్యటించలేదు. పాక్ కు భార‌త జ‌ట్టును పంపించాల‌ని బీసీసీఐ భావించినా ప్ర‌భుత్వం అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది. గ‌తంలో చాలా సార్లు పాక్ ప‌ర్య‌ట‌న‌కు భార‌త్ నో చెప్పింది. 

Latest Videos

undefined

రిషబ్ పంత్ ఔట్ ! బెంచ్‌ను హీటెక్కించిన రియాన్ పరాగ్ ! భార‌త‌ తుది జ‌ట్టులో ఉండేది ఎవ‌రు?

వీటన్నింటి మధ్య పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి భారత రాజకీయ నాయకులపై విరుచుకుపడ్డారు. భారత్ పై మరోసారి విషం కక్కాడు. రాజకీయ కారణాల వల్ల క్రీడలు దెబ్బతినకూడదనీ, భారతదేశంలోని రాజకీయ నాయకులకు పాకిస్థాన్‌ను నిందించే అలవాటు ఉందని ఆరోపించారు. మ‌రోసారి భార‌త్ దే త‌ప్పు అనేలా అయ‌న వ్యాఖ్య‌లు చేయ‌డం మ‌రోసారి ఇరు దేశాల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి కార‌ణంగా మారింది. పాకిస్తాన్ లో ప‌ర్య‌టించేది లేద‌ని ఇదివ‌ర‌కే చాలా సార్లు గ‌ట్టిగానే చెప్పింది భార‌త్. పాక్ పర్యటనపై బీసీసీఐ కూడా ఆస‌క్తి చూప‌డంలేదు. ఇదిలా ఉంటే, టీమిండియాను పాకిస్థాన్‌కు పంపేందుకు భారత ప్రభుత్వం బోర్డును అనుమతించకపోతే, బీసీసీఐ నుంచి రాతపూర్వకంగా విషయాన్ని తెలియజేయాలని పీసీబీ కోరినట్లు సమాచారం.

నివేదికల ప్రకారం, ఐసీసీ టోర్నమెంట్ కోసం తమ చివరి సన్నాహాలను ప్రారంభించేందుకు వీలుగా విషయాన్ని త్వరగా తేల్చాల‌ని పాక్ క్రికెట్ బోర్డు కోరుతోంది. "భారత ప్రభుత్వం అనుమతిని తిరస్కరిస్తే, అది రాతపూర్వకంగా ఉండాలి. ఇప్పుడు ఆ లేఖను ఐసీసీకి బీసీసీఐ అందించ‌డం త‌ప్ప‌ని స‌రి" అని పాక్ క్రికెట్ బోర్డు లోని ఒక‌రు చెప్పిన‌ట్టు పీటీఐ క‌థ‌నాలు పేర్కొన్నాయి. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ఐదారు నెల‌ల ముందే బీసీసీఐ నుంచి పాక్ క్రికెట్ బోర్డు స‌మాధానాలు కోర‌డం వాస్త‌వ‌మేన‌ని సంబంధిత క‌థ‌నాలు పేర్కొన్నాయి.

ఈ ఐదుగురికి అన్యాయం జ‌రిగిందా? టీమిండియా... 

click me!