ఒకే ఓవ‌ర్ లో 6,4,4,4, 6.. పాక్ షాహీన్ అఫ్రిది బౌలింగ్ ను చీల్చిచెండాడిన ఫిన్ అలెన్..

By Mahesh Rajamoni  |  First Published Jan 14, 2024, 5:08 PM IST

New Zealand vs Pakistan: పాకిస్థాన్ తో జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ బ్యాట‌ర్ ఫిన్ అలెన్ ఊచ‌కొత కొన‌సాగింది. పాక్ బౌల‌ర్ షాహీన్ అఫ్రిదికి చుక్క‌లు చూపించాడు. పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిది వేసిన ఒక ఓవ‌ర్ లో 6,4,4,4, 6 బాదిన ఫిన్ అలెన్ 5 బంతుల్లో 24 పరుగుల సాధించాడు. 


NZ vs PAK -  Finn Allen: హామిల్టన్ లోని సెడాన్ పార్క్ లో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్ లో కీవీస్ ప్లేయ‌ర్ ఫిన్ అలెన్ అద్భుత హాఫ్ సెంచరీ, ఆడమ్ మిల్నే నాలుగు వికెట్లతో రాణించడంతో న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా బాబర్ ఆజమ్ 50, ఫకార్ జమాన్ 50 పరుగులు చేసి జట్టు గెలుపుపై ఆశలు పెంచారు. కానీ, వ‌రుస‌ వికెట్లు పడుతూనే ఉండటంతో పాక్ 173 పరుగులకే ఆలౌటైంది. మిల్నేతో పాటు టిమ్ సౌథీ, బెన్ సియర్స్, ఇష్ సోధి చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో న్యూజిలాండ్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.

అయితే, ఈ మ్యాచ్ లో కీవీస్ ఓపెన‌ర్ ఫిన్ అలెన్ పాక్ బౌల‌ర్ల‌పై ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో విరుచుకుప‌డ్డాడు. ముఖ్యంగా పాకిస్తాన్ పేస‌ర్ షాహీన్ ఆఫ్రీదికి చుక్క‌లు చూపించాడు. షాహీన్ అఫ్రిది వేసిన ఒక ఓవ‌ర్ లో 6,4,4,4, 6 బాదిన ఫిన్ అలెన్ 5 బంతుల్లో 24 పరుగుల సాధించాడు. అత‌ని మొదటి ఓవర్‌లో వికెట్ తీసిన తర్వాత ఫుల్ జోష్ లో సెకండ్ ఓవ‌ర్ వేయ‌డానికి వ‌చ్చిన షాహీన్ అఫ్రిదిపై ఫిన్ అలెన్ విరుచుకుప‌డ్డాడు. తన సంచలనాత్మక బ్యాటింగ్ తో ఎడమ చేతివాటం పేసర్ షాహీన్ కు ఎలా బౌలింగ్ చేయాలో తెలియ‌ని తిక‌మ‌కలో ప‌డేశాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో వ‌రుస‌గా 6,4,4,4, 6 బాది 5 బంతుల్లో  24 పరుగుల రాబ‌ట్టాడు. పాక్ బౌల‌ర్ ను చీల్చిచెండాడాడు.

Latest Videos

IND vs PAK: క్రేజీ బ‌జ్.. భార‌త్-పాకిస్తాన్ మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్.. 

ఈ ఓవ‌ర్ లో తొలి బంతికి డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్స్‌తో మొద‌లు పెట్టిన ఫిన్ అలెన్.. లాంగ్-ఆన్ ఓవర్ లో సిక్సర్ కొట్టే ముందు వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. చివరి డెలివరీ డాట్ బాల్ అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫిన్ అలెన్ అద్భుత హాఫ్ సెంచరీ, ఆడమ్ మిల్నే నాలుగు వికెట్లతో రాణించడంతో న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో పాక్ పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో న్యూజిలాండ్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TVNZ+ (@tvnz.official)

David Warner: క్రికెట్ ఆడేందుకు హెలికాప్ట‌ర్ తో గ్రౌండ్ లో దిగిన డేవిడ్ వార్న‌ర్.. ! వైరల్ వీడియో 

click me!