పాకిస్తాన్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన న్యూజిలాండ్.. ఫిన్ అలెన్ ఉచ‌కొత !

By Mahesh Rajamoni  |  First Published Jan 14, 2024, 4:15 PM IST

New Zealand vs Pakistan: పాకిస్థాన్ తో జరిగిన రెండో టీ20లో ఫిన్ అలెన్ అద్భుత ప్రదర్శనతో పాక్ బౌల‌ర్ల‌ను ఒక ఆట ఆడుకున్నాడు. అలాగే, ఆడమ్ మిల్నే నాలుగు వికెట్ల ప్రదర్శనతో న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో పాక్ పై విజయం సాధించింది.
 


New Zealand vs Pakistan T20I:  రెండో టీ20 మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ ను న్యూజిలాండ్ చిత్తుచేసింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌ర‌గొట్టి పాక్ ను మ‌ట్టిక‌రిపించింది. హామిల్టన్ లోని సెడాన్ పార్క్ లో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్ లో కీవీస్ ప్లేయ‌ర్ ఫిన్ అలెన్ అద్భుత హాఫ్ సెంచరీ, ఆడమ్ మిల్నే నాలుగు వికెట్లతో రాణించడంతో న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో పాక్ పై ఘన విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా బాబర్ ఆజమ్ 50, ఫకార్ జమాన్ 50 పరుగులు చేసి జట్టు గెలుపుపై ఆశలు పెంచారు. కానీ, వ‌రుస‌ వికెట్లు పడుతూనే ఉండటంతో పాక్ 173 పరుగులకే ఆలౌటైంది. మిల్నేతో పాటు టిమ్ సౌథీ, బెన్ సియర్స్, ఇష్ సోధి చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో న్యూజిలాండ్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.

పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 ప‌రుగులు చేసింది.  న్యూజిలాండ్ బ్యాట‌ర్స్ లో ఫిన్ అలెన్ 74(41), కేన్ విలియమ్సన్ 26(15) ప‌రుగుల‌తో రాణించారు. పాకిస్తాన్ బౌల‌ర్ల‌లో హారిస్ రవూఫ్ 3, అబ్బాస్ అఫ్రిది 2 వికెట్లు తీసుకున్నారు. 195 ప‌రుగుల భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ 19.3 ఓవర్లలో 173 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. పాకిస్తాన్ బ్యాట‌ర్స్ లో బాబర్ అజామ్ 66(43), ఫఖర్ జమాన్ 50(25) ప‌రుగుల‌తో రాణించారు. న్యూజిలాండ్ బౌల‌ర్లు ఆడమ్ మిల్నే 4, బెన్ సియర్స్ 2 వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్ లో అద‌ర‌గొట్టిన ఫిన్ అలెన్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 

Latest Videos

undefined

DAVID WARNER: క్రికెట్ ఆడేందుకు హెలికాప్ట‌ర్ తో గ్రౌండ్ లో దిగిన డేవిడ్ వార్న‌ర్.. ! వైరల్ వీడియో

స్కోర్ బోర్డు: 

న్యూజిలాండ్ 194/8 (20 ఓవ‌ర్లు)

పాకిస్తాన్ 173 (19.3 ఓవ‌ర్లు )

న్యూజిలాండ్  వికెట్ల పతనం: 59-1 ( కాన్వే , 5.1), 137-2 ( ఫిన్ అలెన్ , 12.5), 147-3 ( డారిల్ మిచెల్ , 13.6), 157-4 ( చాప్‌మన్ , 16.1), 182-5 ( గ్లెన్ ఫిలిప్స్ , 18.1), 182 6 ( మిల్నే , 18.2), 183-7 ( ఇష్ సోధి , 18.4), 192-8 ( సాంట్నర్ , 19.4)

పాకిస్తాన్ వికెట్ల ప‌త‌నం: 8-1 ( సాయిమ్ అయూబ్ , 0.5), 10-2 ( మహ్మద్ రిజ్వాన్ , 1.3), 97-3 ( ఫఖర్ జమాన్ , 9.4), 105-4 ( ఇఫ్తికర్ అహ్మద్ , 11.5), 108-5 ( అజం ఖాన్ , 12.3), 125-6 ( అమెర్ జమాల్, 14.3), 153-7 ( బాబర్ ఆజం , 17.1), 165-8 ( షాహీన్ అఫ్రిది , 18.2), 165-9 ( ఉసామా మీర్ , 18.3), 173-10 ( అబ్బాస్ అఫ్రిది, 19.3)

న్యూజిలాండ్ జ‌ట్టు: ఫిన్ అలెన్ , డెవాన్ కాన్వే , కేన్ విలియమ్సన్ (కెప్టెన్) , డారిల్ మిచెల్ , గ్లెన్ ఫిలిప్స్ , మార్క్ చాప్మన్ , మిచెల్ సాంట్నర్ , ఆడమ్ మిల్నే , టిమ్ సౌథీ , ఇష్ సోధి , బెన్ సియర్స్.

పాకిస్తాన్ జ‌ట్టు: సైమ్ అయూబ్ , మహ్మద్ రిజ్వాన్ , బాబర్ ఆజం , ఫఖర్ జమాన్ , ఇఫ్తీకర్ అహ్మద్ , ఆజం ఖాన్, అమీర్ జమాల్ , షాహీన్ అఫ్రిది (కెప్టెన్) , ఉసామా మీర్ , అబ్బాస్ అఫ్రిది , హరీస్ రవూఫ్.

కలలో పాము కనిపిస్తే అర్థమేంటి..? శుభమా.. అశుభమా..?

click me!