Ms Dhoni - Rohit Sharma : ఐపీఎల్ కెప్టెన్‌లుగా ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలు ఇద్దరూ రికార్డు స్థాయిలో ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్నారు. అయితే, ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్ల కెప్టెన్సీ పై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ పార్థీవ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
IPL 2024 : ఇప్పటికే చెరో ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ లో ఆరో టైలిల్ ను గెలుచుకోవడంపై కన్నేశాయి. ఇప్పటికే ఇరు టీమ్స్ ఐపీఎల్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత మాజీ కెప్టెన్న ఎంఎస్ ధోనీ కూడా తప్పులు చేశాడు కానీ రోహిత్ శర్మ ఎప్పుడూ చేయలేదంటూ చెన్నై మాజీ స్టార్ ప్లేయర్ పార్థీవ్ పటేల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్‌లో తమ ఐపీఎల్ ప్రారంభ దశలో పోరాడుతున్నప్పుడు రోహిత్ శర్మకు పూర్తి మద్దతు లభించిందని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అన్నారు. పార్థీవ్ రోహిత్ నాయకత్వాన్ని చెన్నై స్టార్ ప్లేయర్, కెప్టెన్ ధోనితో పోల్చాడు. ఈ క్రమంలోనే ముంబై క్రికెటర్ రోహిత్ శర్మ ఎప్పుడూ తప్పు చేయలేదని చెప్పిన పార్థీవ్ పటేట్.. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని తన సుదీర్ఘ ఐపీఎల్ సమయంలో కొన్ని సందర్భాల్లో తప్పు చేసాడని తెలిపాడు.
undefined
RCB : పేరుమార్చుకున్న కోహ్లీ టీమ్.. సరికొత్త లుక్ లో కొత్త జెర్సీతో బెంగళూరు.. !
"రోహిత్ తన ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యమైన విషయం అని నేను భావిస్తున్నాను. దీనికి ఉత్తమ ఉదాహరణలు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా 2014లో ముంబై ఇండియన్స్ లో చేరాడు. 2015 నాటికి అతని ప్రదర్శన గొప్పగా లేద"ని పార్థివ్ జియో సినిమాతో మాట్లాడుతూ అన్నారు. "సగం సీజన్ తర్వాత అతన్ని వెనక్కి పంపడం గురించి కూడా వారు ఆలోచించారు. కానీ రోహిత్ శర్మ అతని సామర్థ్యాన్ని విశ్వసించాడు. 2016 నుండి అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది" అని 25 టెస్టులు ఆడిన మాజీ భారత వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ అన్నాడు.
అలాగే, అంతకుముందు ముంబై జట్టులో ఉన్న హార్ధిక్ పాండ్యా విషయంలోనూ రోహిత్ అలాగే ఉన్నాడని చెప్పాడు. "హార్దిక్ పాండ్యాతో కూడా అలాగే ఉన్నాడు. 2015లో టీమ్ లోకి వచ్చి పాపులర్ అయ్యాడు. అతని 2016 సీజన్ గొప్పగా లేదు కానీ ముంబై అతనితో అతుక్కుపోయి పాండ్యా ఈనాటి ఆటగాడిగా మారాడు." రోహిత్ జట్టుకు ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తున్నాడని, ఇది సాటిలేనిదని చెప్పాడు. ముంబై జట్టు ఒక్క పరుగు తేడాతో రెండు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకోవడం ఉత్తమ ఉదాహరణగా పేర్కొన్నాడు. మైదానంలో ప్రశాంతంగా ఉండగల కెప్టెన్ మీకు లేకపోతే అది సాధ్యం కాదన్నాడు.
2018 నుంచి 2024 వరకు ఐపీఎల్ ఆడుతున్న టాప్-5 ప్లేయర్లు వీరే..
ఉద్రిక్తమైన మ్యాచ్ ఉన్నప్పుడు, కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు లేదా పొరపాట్లు జరుగుతాయి. కానీ రోహిత్ శర్మ కెప్టెన్సీ ముఖ్య లక్షణం ఏమిటంటే, గత 10 సంవత్సరాలలో అలాంటి సమయాల్లో ఎలాంటి తప్పులు చేయలేదని పార్థీవ్ పటేల్ అన్నాడు. "ధోనీ కూడా పవన్ నేగికి ఓవర్ ఇవ్వడం వంటి తప్పులు చేసాడు, కానీ మీరు రోహిత్‌ని చూస్తే, మీరు ఎప్పటికీ తప్పు చూడలేరు. ప్రక్రియను సరళంగా ఉంచడం అనేది ధోని సలహా ఇచ్చే విషయం, కానీ మేము ఆటలలో రోహిత్ ప్రాక్టీస్ చేయడం చూస్తాము" అని పార్థివ్ తెలిపాడు. రోహిత్ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటాడనీ, ఐపీఎల్‌లో కెప్టెన్‌కు ఇది చాలా కష్టమైన పనిగా పేర్కొన్నాడు.
IPL 2024: ధోనిని ఢీ కొట్టనున్న విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ ఈసారైనా టైటిల్ గెలిచేనా..?