CSK vs RCB: ఐపీఎల్ 2024 లో మార్చి 22న బెంగళూరు-చెన్నై టీమ్ లు తలపడనున్నాయి. విరాట్ కోహ్లి తన కొడుకు అకాయ్ వచ్చిన జోష్ లో ఉండగా, సీఎస్కే టీమ్ కు మరో టైటిల్ ను అందించాలని ఎంఎస్ ధోని వ్యూహాలతో బరిలోకి దిగుతున్నారు.
Chennai Super Kings vs Royal Challengers Bangalore: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ మార్చి 22న చెన్నైలో ప్రారంభం కానుంది. 'తలా' ఎంఎస్ ధోని నేతృత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తో విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో తలపడనుంది. ఇద్దరు దిగ్గజ ప్లేయర్లు, టీమిండియా మాజీ కెప్టెన్ల జట్లు ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్ లో తలపడుతుండటంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అలాగే, దాదాపు రెండు నెలల తర్వాత కింగ్ కోహ్లి క్రికెట్ గ్రౌండ్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఇటీవల వ్యక్తిగత కారణాల వల్ల, అతను ఇండియా vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. ఇప్పుడు, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు తమ రెండో బిడ్డ కోసం క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఫిబ్రవరి 15న, రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో సిరీస్‌లోని మూడవ టెస్ట్ మ్యాచ్ ఆడటం ప్రారంభించినప్పుడు, విరాట్-అనుష్క దంపతులు తమ కుమారుడు అకాయ్‌కు స్వాగతం పలికారు. అకాయ్ వచ్చిన ఆనందంతో జోష్ మీదుకున్న విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024లో అదరగొట్టాలని చూస్తున్నాడు.
ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ అదరగొట్టడం ఖాయం.. '
ఇక కొంత విరామం తర్వాత ఎంఎస్ ధోనీ కూడా మళ్లీ యాక్షన్‌లోకి దిగుతున్నాడు. అతను 10 నెలల క్రితం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో చివరిసారిగా క్రికెట్ గ్రౌండ్ లో కనిపించాడు. మే 28న, మహి తన జట్టును చారిత్రాత్మక ఐదవ ఐపీఎల్ టైటిల్ ను అందించాడు. అయితే, ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత ధోని రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉన్నందున ఈ సారి ట్రోఫీతో ఘనంగా వీడ్కోలు పలకాలని చూస్తున్నాడు.
ఇదిలా ఉంటే, గత కొన్నేళ్లుగా ధోనీతో కొంత సమయం గడపడం తన అదృష్టంగా భావిస్తున్నానని బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ అన్నాడు. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో 2018-2021 మధ్య చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో డుప్లెసిస్ ఉన్నాడు. "ఇది బహుశా నా కెరీర్‌లో అతిపెద్ద విషయం, చెన్నైలో నా సంవత్సరాలు. ఇది నన్ను నాయకత్వ దృక్పథం ఎంఎస్ ధోని నుంచి రూపొందించింది.. యువ నాయకుడిగా, ఇది నా ఎదుగుదలకు ప్రత్యేకమైనది. ధోని ఎప్పటికీ గొప్ప కెప్టెన్" అని ఆర్సీబీ కెప్టెన్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ అన్నాడు.
ఈ సీజన్ లో టైటిల్ గెలుస్తుంది?
ఇప్పటివరకు బెంగళూరు మూడుసార్లు ఐపీఎల్ ఫైనల్స్‌కు చేరుకుంది కానీ, మూడు సందర్భాల్లోనూ విజయం సాధించలేకపోయింది. అయితే, ఆర్సీబీ మహిళలు ఇటీవలే వారి ఫ్రాంచైజీకి మొట్టమొదటి టీ20 ట్రోఫీని అందించారు. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన తన జట్టును విజయతీరాలకు చేర్చింది. ఇది స్టార్లతో కూడిన పురుషుల జట్టుకు ప్రేరణగా పనిచేస్తుందా? అనే విషయం ఆర్సీబీ టోర్నమెంట్‌ను ఎలా ప్రారంభించాలనే దానిపై చాలా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి, అందరి దృష్టి ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ పైనే ఉంది.
బాలీవుడ్ స్టార్లతో అదిరిపోయేలా ఐపీఎల్ 2024 ఆరంభ వేడుకలు..