ఐసీసీ ప్రపంచ చప్ 2023 ట్రోఫీపై మిచెల్ మార్ష్ కాళ్లు పెట్టిన ఫొటో వైరల్ అయ్యింది. దీనిపై క్రికెట్ అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. తాజాగా ఈ ఫొటోపై ఆయన స్పందించారు. అయితే వ్యాఖ్యలపై కూడా క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే ?
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ వరల్డ్ కప్ (ICC World cup 2023) ట్రోఫీపై కాళ్లు పెట్టి, చేతిలో బీరు బాటిల్ తో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఈ ఘటనపై క్రికెటర్ మహ్మద్ షమీ కూడా విమర్శలు గుప్పించారు. అయితే ఈ వివాదానికి కారణమైన మిచెల్ మార్ష్ ఈ విషయంలో తొలిసారిగా నోరు విప్పారు.
ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా ఆయన పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదాస్పదమైన ఫొటో విషయం చర్చకు వచ్చింది. దీంతో ఆయన ఈ అంశంపై తొలిసారిగా నోరు విప్పారు. తాను మామూలుగానే కాళ్లు పెట్టానని, ఎవరి మనోభావాలు దెబ్బ తీయాలనే ఉద్దేశం తనకు లేదని అన్నారు. ‘ ఆ ఫొటోలో ఎలాంటి అగౌరవం కనిపించడం లేదు. కాళ్లు పెట్టినప్పుడు నేను పెద్దగా ఆలోచించలేదు. అందులో తప్పేమీ లేదు. సోషల్ మీడియాలో అది వైరల్ అయ్యిందని నాకు అందరూ చెప్పారు. కానీ నేను దానిని పెద్దగా పట్టించుకోలేదు’’ అని మిచెల్ మార్ష్ అన్నారు.
KCR : రెండు రోజులు ఓపిక పట్టండి.. వచ్చేది మన ప్రభుత్వమే - కేసీఆర్
అయితే మళ్లీ అవకాశం వస్తే మిచెల్ మార్ష్ ను ప్రశ్నించగా.. అవునని, అవకాశం ఉంటే అలాగే చేస్తానని చెప్పారు. తాజా కామెంట్లతో క్రికెట్ అభిమానుల్లో మరింత ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కాగా.. మార్ష్ చర్యను ఇటీవల టీమ్ ఇండియా ప్లేయర్ మహ్మద్ షమీ ఖండించారు. ఓ క్రికెటర్ తన తలపై ఎత్తుకోవాలనే ట్రోఫీని, ఒకరు కాళ్ల కింద పెట్టుకోవడం చూసి బాధపడ్డానని తెలిపారు.
Cyclone Michaung : ముంచుకొస్తున్న మైచౌంగ్ తుఫాన్.. ఎప్పుడు ? ఎక్కడ ? అది తీరం దాటనుందంటే..
ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ ప్రపంచ కప్ క్రికెట్ ట్రోఫీపై కాళ్లు పెట్టిన ఫోటో పై ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్ ఢిల్లీ గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రపంచకప్ క్రికెట్ ట్రోఫీపై కాళ్లు పెట్టి వందకోట్లకు పైగా భారతీయుల గౌరవాన్ని అవమానించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు మిచెల్ మార్ష్ పై కేసు నమోదు చేశారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు కూడా ఆయన ఫిర్యాదు అందజేశారు.