T20 World Cup: ఐసీసీ ఈవెంట్ లోకి కొత్త జ‌ట్టు.. టీ20 ప్రపంచకప్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే..

By Mahesh Rajamoni  |  First Published Dec 1, 2023, 3:18 PM IST

ICC T20 World Cup: యూఎస్ఏ తొలిసారిగా ఐసీసీ మెగా ఈవెంట్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్న‌మెంట్ కు ఆతిథ్యం ఇవ్వనుండగా, వెస్టిండీస్ సహ ఆతిథ్యం ఇవ్వనుంది. రాబోయే టీ20 వరల్డ్ క‌ప్‌లో మొద‌టిసారి 20 జట్లు పోటీపడుతున్నాయి.


T20 World Cup - 20 teams: ఐసీసీ 2007లో టీ20 ప్రపంచకప్ సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఈ మెగా ఈవెంట్ లో ఇప్పటివరకు మొత్తం 8 టీ20 ప్రపంచకప్ టోర్నీలు జరిగాయి. ఇంగ్లాండ్, వెస్టిండీస్ చెరో రెండుసార్లు టైటిల్ గెలుచుకోగా, భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా చెరోసారి టైటిల్ గెలిచాయి. వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికాలో 9వ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే, ఈ సారి టీ20 ప్రపంచకప్ లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి.

2022 టీ20 ప్రపంచకప్ లో టాప్-8లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా టీ20 వరల్డ్ క‌ప్ అర్హత సాధించాయి. మిగిలిన జట్లను క్వాలిఫయింగ్ రౌండ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. క్వాలిఫయర్స్ ముగిసే సమయానికి ఐర్లాండ్, స్కాట్లాండ్, పపువా న్యూ గినియా, కెనడా, నేపాల్, ఒమన్ అర్హత సాధించాయి. చివరి రెండు జట్లకు ఆఫ్రికా రీజినల్ క్వాలిఫయర్స్ కూడా జరిగాయి. ఆడిన ఐదు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించి టోర్నీకి అర్హత సాధించిన 19వ జట్టుగా నమీబియా నిలిచింది. మిగిలిన ఒక స్థానం కోసం జింబాబ్వే, ఉగాండా, కెన్యా జట్లు పోటీ ప‌డ్డాయి. ఉగాండా క్రికెట్ జట్టు ఐసీసీ సిరీస్ కు అర్హత సాధించడం ఇదే తొలిసారి.

Latest Videos

ఐసీసీ క్రికెట్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. 

అమెరికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, కెనడా, నేపాల్, ఒమన్, నమీబియా, ఉగాండా.
 

click me!