కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకున్న విషయం తెలిసిందే. అయితే మొదట బౌలింగ్ తీసుకోవడానికి గల కారణాన్ని కెప్టెన్ హార్దిక్ పాండ్యా వివరించాడు..
టాస్ గెలిచిన మొదట బౌలింగ్ తీసుకోవడానికి గల కారణాన్ని హార్ధిక్ పాండ్యా వివరిస్తూ.. వాంఖడే పిచ్ స్వభావాన్ని గమనించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. వాంఖడే స్టేడియంలో స్వింగ్‌తో పాటు తేమ ప్రభావం ఉండే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితుల్లో ఛేజింగ్ తమకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. మంచి ఆరంభంతో మ్యాచ్‌ను మొదలు పెట్టాలని భావిస్తున్నామని చెప్పుకొచ్చాడు.
ఇక కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ తీసుకునే వాళ్లమని చెప్పుకొచ్చాడు. పిచ్ స్వభావం కొన్ని సందేహాలు రేకెత్తించిందని కానీ వాంఖడే బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌గా మారుతుందని అభిప్రాయపడ్డాడు. అయితే, గాలులు వీస్తుండటంతో తేమ ప్రభావం ఉండకపోవచ్చని, భారీ స్కోర్ చేసి బౌలింగ్‌తో కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ముంబై జట్టులో రోహిత్ శర్మ తుది జట్టులో లేకపోయినా, ఇంపాక్ట్ ప్లేయర్‌గా రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగే అవకాశముంది. అలాగే, యువ ఆటగాడు అశ్విని కుమార్ అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు, విజ్ఞేష్ పుత్తూర్ తిరిగి జట్టులోకి వచ్చాడు, అయితే తెలుగు ఆటగాడు సత్యనారాయణ రాజుకు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కలేదు. ఇక కోల్‌కతా జట్టుకు కీలక ఆటగాడు సునీల్ నరైన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. మోయిన్ అలీ స్థానంలో అతను ఆడుతున్నాడు.
పట్టు బిగిస్తోన్న ముంబై ఇండియన్స్:
గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ బౌలింగ్‌లో సత్తా చాటింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే అన్నట్లు నిరూపించారు. పకడ్బందీగా బౌలింగ్ వేసి పవర్ ప్లేలో కోల్‌కతాను కంట్రోల్ చేశారు. 50 పరుగలకే కేకేఆర్ 5 వికెట్లు కోల్పోయింది. 8 ఓవర్లు ముగిసే సమయానికి కోల్‌కతా నైట్ రైడర్స్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 59 పరుగుల వద్ద కొనసాగుతోంది.