MI vs KKR: మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్‌కి గుడ్ న్యూస్‌.. బుమ్రా రీ ఎంట్రీ ఇస్తున్నాడా.?

మరికాసేపట్లో ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. అయితే ముంబై అభిమానులకు ఓ వార్త ఉత్సాహాన్ని నింపుతోంది. వెన్ను నొప్పి నుంచి కోలుకుంటున్న బుమ్రా బౌలింగ్‌ చేస్తూ కనిపించాడు. దీంతో బుమ్రా రీఎంట్రీపై ఫ్యాన్స్‌లో ఆశలు చిగురించాయి.. 

IPL 2025: Jasprit Bumrah's Comeback Trail and MI's Hopes details in telugu VNR

ముంబై ఇండియన్స్ పేసర్, జస్ప్రీత్ బుమ్రా మార్చి 30న బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. జనవరి నుంచి ఆటకు దూరంగా ఉన్న బుమ్రా మళ్లీ వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

జనవరిలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో బుమ్రాకు వెన్ను నొప్పి వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు. దీంతో టీమ్ ఇండియా టైటిల్ గెలవలేకపోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-3 తేడాతో ఓడిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడతాడా లేదా అనే దానిపై ముందు ఎలాంటి స్పస్టత ఇవ్వలేదు. కానీ మొదట జట్టులో ఉన్నాడు. ఆ తర్వాత ఫిట్‌గా లేడని ప్రకటించారు.

Latest Videos

ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాక, బుమ్రా ఐపీఎల్ కోసం సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే ఫిట్ నెస్ ను తిరిగి పొందేందుకు తీవ్రంగా శ్రమించాడు. అయితే ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత కూడా బుమ్రా ఇంకా జట్టులోకి రాలేదు. కానీ రీఎంట్రీ కోసం కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఎన్సీఏ నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో బుమ్రా ఫుల్ స్పీడ్‌తో బౌలింగ్ చేస్తున్నాడు.

న్సీఏ నెట్స్‌లో బుమ్రా బౌలింగ్!

JASPRIT BUMRAH BOWLING AT THE NCA. 🐐🔥pic.twitter.com/6kP2NBYWec

— Mufaddal Vohra (@mufaddal_vohra)

బుమ్రా లేకపోవడంతో ముంబై ఇండియన్స్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇంకా ఖాతా తెరవలేదు. చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. హార్దిక్ పాండ్యా బ్యాన్ కారణంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 

హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వచ్చినా ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. బుమ్రా లేకపోవడంతో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. దీపక్ చాహర్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ గెలుస్తుందా? 

ముంబై ఇండియన్స్ తమ మొదటి హోమ్ మ్యాచ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో వాంఖడే స్టేడియంలో సోమవారం ఆడనుంది. గతంలో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. 

ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు 34 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై 23 సార్లు గెలిచింది. కోల్‌కతా 11 మ్యాచ్‌లు గెలిచింది. గత ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబైని ఓడించింది. 

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

ముంబై ఇండియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఎలాగైనా గెలిచి ఐపీఎల్ 2025లో బోణీ కొట్టాలని చూస్తోంది. మరి చివరి నిమిషంలో బుమ్రా జట్టులోకి వస్తాడా, ముంబై ఈ సీజన్ లో బోణీ కొడుతుందా? తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాలి. 

vuukle one pixel image
click me!