IPL 2025: రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై ఓటమి చవి చూసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ అమ్మాయి వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఇంతకీ అంతలా వైరల్ కావడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
MS Dhoni Girl Fan Viral Video: ఇప్పుడు దేశంలో ఐపీఎల్ 2025 నడుస్తోంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ 6 పరుగుల తేడాతో CSKని ఓడించింది. ఈ మ్యాచ్‌లో ధోనీ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.ధోనీ ఏది చేసినా అది వైరల్ అవ్వడం ఖాయం. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఒక సీన్ జరిగింది చెన్నై జట్టును గెలిపించేందుకు మహేంద్రసింగ్ ధోని.. కాస్త ముందుగానే వచ్చాడు. అప్పటికే ఒక సిక్స్ అలాగే ఒక బౌండరీ బాదిన ధోని.. మ్యాచ్ ఎలాగైనా గెలిపిస్తాడని అందరూ అనుకున్నారు.
అయితే భారీ షాట్ కు ప్రయత్నించిన బౌండరీ దగ్గర ఉన్న హెట్ మేర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో మహేంద్ర సింగ్ ధోని 11 బంతుల్లో 16 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మహేంద్ర సింగ్ ధోని అవుట్ కాగానే…. స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. ఇదే సమయంలో స్టేడియంలో ఉన్న ఓ అమ్మాయి ఎక్స్ ప్రెషన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
రాజస్థాన్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు చివరి ఓవర్‌లో 20 పరుగులు కావాలి. సందీప్ శర్మ బౌలింగ్‌కు రాగా.. ధోనీ బ్యాటింగ్ చేస్తున్నాడు. సందీప్ మొదటి బంతిని వైడ్‌గా వేశాడు. ఆ తర్వాత బంతిని ధోనీ స్టాండ్స్‌లోకి పంపాలని చూశాడు. బంతి బ్యాట్‌కు గట్టిగా తగిలింది. బంతి బౌండరీ దాటుతుందని అందరూ అనుకున్నారు. కానీ లాంగాన్‌లో ఉన్న సిమ్రాన్ హెట్‌మెయిర్ క్యాచ్ పట్టేశాడు. ధోనీ వికెట్ పడగానే స్టేడియంలోని ఓ అమ్మాయి ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Reaction when dhoni got out..
She has become famous like hawk tuah girl...pic.twitter.com/mnvc4SWDX2
— Only Option - Trader (@WithOnlyOption)
Xలో వైరల్ అవుతున్న వీడియోలో పసుపు రంగు డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఎక్స్‌ప్రెషన్స్ చూడొచ్చు. ధోనీ అవుట్ అవ్వగానే తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. చేతులతో రియాక్షన్ ఇచ్చింది. అమ్మాయి ఫేస్ చూస్తే ఏదో జరిగిపోయిందని అనిపిస్తుంది. ఆమె ధోనీకి ఎంత పెద్ద ఫ్యానో అర్థం చేసుకోవచ్చు. ధోనీ అవుట్ అవ్వడంతో ఆ అమ్మాయి కోపం కట్టలు తెంచుకున్నట్లు అయ్యింది.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 16 పరుగులు చేశాడు. 11 బంతులు ఆడి 1 ఫోర్, 1 సిక్స్ కొట్టాడు. ధోనీ 7వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. 16వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు రాగా.. టీమ్ గెలవడానికి 25 బంతుల్లో 54 పరుగులు కావాల్సి ఉంది. అప్పుడు రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నాడు. ధోనీ, జడేజా ప్రయత్నించారు. కానీ ధోనీ అవుట్ కావడంతో చెన్నై పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. కాగా ఈ సీజన్ లో చెన్నైకి ఇది రెండో ఓటమి.