Latest Videos

మిచెల్ స్టార్క్ పై కేకేఆర్ రూ. 24.75 కోట్లు కుమ్మరించింది ఇందుకే.. !

By Mahesh RajamoniFirst Published May 27, 2024, 7:52 AM IST
Highlights

Mitchell Starc : ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో రెండు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలుచుకున్న తొలి ప్లేయ‌ర్ గా మిచెల్ స్టార్క్ చ‌రిత్ర సృష్టించాడు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఐపీఎల్లోకి పునరాగమనం చేసి అద్భుత‌మైన బౌలింగ్ తో 17 వికెట్లు తీసుకున్నాడు. 
 

Mitchell Starc : దాదాపు 9 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఐపీఎల్ లోకి తిరిగి ఏంట్రీ ఇచ్చిన స్టార్ బౌల‌ర్ మిచెల్ స్టార్ మ‌రోసారి త‌న బౌలింగ్ ప‌దును ఏంటో చూపించాడు. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మను క్లీన్ బౌల్డ్ చేయడానికి మిచెల్ స్టార్క్ అద్భుతమైన డెలివరీని అందించాడు. అలాగే, హైద‌రాబాద్ కీల‌క ప్లేయ‌ర్ రాహుల్ త్రిపాఠిని ఔట్ చేసి కేకేఆర్ గెలుపులో త‌న‌దైన ముంద్ర వేశాడు. చాలా కాలం త‌ర్వాత ఐపీఎల్ వేలంలోకి వ‌చ్చిన మిచెల్ స్టార్క్ ను కేకేఆర్ ఏకంగా రూ. 24.75 కోట్లకు ద‌క్కించుకుంది. ఐపీఎల్ వేలంలో ఇది స‌రికొత్త రికార్డు ధ‌ర‌. 

ఇంత భారీ ధ‌ర పెట్టి మిచెల్ స్టార్క్ ను జ‌ట్టులోకి తీసుకోవ‌డంపై క్రికెట్ వ‌ర్గాల‌తో పాటు ఇత‌ర ప్రాంఛైజీలు సైతం న‌వ్వుకున్నాయి. కానీ, ఇప్పుడు  వారు చేసింది తెలివైన ప‌ని అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నాయి. భారీ ధ‌ర‌తో వార్త‌ల్లో నిలిచి మిచెల్ స్టార్క్ ఐపీఎల్ 2024 ఆరంభంలో పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయాడు. దీంతో కేకేఆర్ అత‌ని పై కోట్టు కుమ్మ‌రించ‌డం, స్టార్క్ బౌలింగ్ ఫామ్ పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ, ఎప్పుడైతే కేకేఆర్ ప్లేఆఫ్స్ కు అర్హ‌త సాధించిందో అప్ప‌టి నుంచి ప్ర‌తి మ్యాచ్ లో స్టార్క్ త‌న బౌలింగ్ ప‌దును చూపించ‌డం మొద‌లుపెట్టాడు.

IPL 2024 ఫైనల్లో సన్‌రైజర్స్ ఓటమి.. ఏడ్చేసిన కావ్య మార‌న్.. వీడియో

ఈ సీజ‌న్ ప్రారంభంలో పెద్ద‌గా వికెట్లు తీసుకోలేక‌పోయినా.. ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో అద్భుత‌మైన బౌలింగ్ తో కేకేఆర్ కు విజ‌యాలు అందించాడు. ప్లేఆఫ్స్ లో  రెండు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న తొలి ప్లేయ‌ర్ గా మిచెల్ స్టార్క్ చ‌రిత్ర సృష్టించాడు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఐపీఎల్లోకి పునరాగమనం చేసి అద్భుత‌మైన బౌలింగ్ తో 17 వికెట్లు తీసుకున్నాడు. క్వాలిఫ‌య‌ర్ 1 మ్యాచ్ తో పాటు ఫైన‌ల్ మ్యాచ్ లో కీల‌క వికెట్లు తీసుకుని హైద‌రాబాద్ దెబ్బ‌కొట్టాడు. ఈ మ్యాచ్ ల‌లో హైద‌రాబాద్ ఓట‌మిలో ప్ర‌ధాన కార‌ణం మిచెల్ స్టార్క్ తీసుకున్న వికెట్లు.. అది కూడా కీల‌క స‌మ‌యంలో జ‌ట్టుపై ప్ర‌భావం చూపి ఇత‌ర ప్లేయ‌ర్లు బ్యాటింగ్ చేయ‌డంలో ఇబ్బంది ప‌డ‌టానికి కార‌ణంగా నిలిచాడు. దీంతో హైద‌రాబాద్ జ‌ట్టు ఓట‌మి నుంచి త‌ప్పించుకోలేక‌పోయింది.

గౌతమ్ గంభీర్ ను ముద్దు పెట్టుకున్న షారుఖ్ ఖాన్.. వీడియో

 

Ball of the season? 👀🤌pic.twitter.com/fnl7oWkhQb

— KolkataKnightRiders (@KKRiders)

 

IPL 2024 Final : అదరగొడుతారనుకుంటే ఆలౌట్ అయ్యారు.. అసలు కారణం 

click me!