కెప్టెన్ గా భార‌త జ‌ట్టులోకి తిరిగొస్తున్న కేఎల్ రాహుల్.. !

By Mahesh Rajamoni  |  First Published Jul 10, 2024, 9:22 PM IST

KL Rahul : శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత వన్డే జట్టులో స్టార్ ప్లేయ‌ర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి లభించే అవకాశం ఉంది. టీ20 ప్ర‌పంచ క‌ప్ లో చోటుద‌క్కించుకోలేక పోయిన కేఎల్ రాహుల్ జ‌ట్టులోకి తిరిగి రానున్నాడు. 
 


Team India : ప్ర‌స్తుతం జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త జ‌ట్టు ఇది ముగ‌సిన వెంట‌నే శ్రీల‌క టూర్ కు వెళ్ల‌నుంది. భార‌త క్రికెట్ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ గౌతమ్ గంభీర్ శ్రీలంక పర్యటనతో తన మొదటి అసైన్‌మెంట్‌ను ప్రారంభించనున్నారు. శ్రీలంకలో భారత్ 3 వన్డేలు, 3 టీ20లు ఆడ‌నుంది. దీంతో ఈ వారం చివరిలోగా జట్టు ఎంపిక జరుగుతుందని బీసీసీఐ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, అనూహ్యంగా టీ20 ప్ర‌పంచ క‌ప్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకోలేకపోయిన స్టార్ ప్లేయ‌ర్ కేఎల్ రాహుల్ తిరిగి జ‌ట్టులోకి రానున్నారు. శ్రీలంకతో జ‌రిగే సిరీస్ లో భార‌త‌ వన్డే జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించే అవకాశముంద‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

ఇటీవ‌లే ముగిసిన టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో ఛాంపియ‌న్ గా నిలిచింది భార‌త్. జ‌ట్టులోని ప్లేయ‌ర్లు విశ్రాంతినిచ్చి యంగ్ ప్లేయ‌ర్ల‌తో కూడిన జ‌ట్టును జింబాబ్వేతో జ‌రుగుతున్న సిరిస్ కు బీసీసీఐ పంపింది. టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత స్టార్ ప్లేయ‌ర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా రాబోయే వ‌న్డే సిరీస్ కు దూరంగా ఉండ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ స్టార్ ప్లేయ‌ర్లు విశ్రాంతి తీసుకోవ‌డంతో కేఎల్ రాహుల్ టీమిండియా వ‌న్డే జ‌ట్టుకు కెప్టెన్ గా తిరిగి రానున్నాడు.

Latest Videos

రోహిత్ శ‌ర్మ‌ను వెన‌క్కినెట్టిన జస్ప్రీత్ బుమ్రా.. !

భారత జట్టు సెలక్షన్ కమిటీతో టీమిండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్ తొలి సమావేశం ఈ వారం చివర్లో జరగనుంది. రెండు ఫార్మాట్లకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లను ఎంచుకోవాలని గంభీర్ ఆసక్తిగా ఉన్నాడని అర్థమవుతోంది. వన్డే ఫార్మాట్ కోసం ఇంతకుముందు కూడా వైట్-బాల్ ఫార్మాట్‌లో భారత్‌ను నడిపించిన కెఎల్ రాహుల్ పేరు తెరపైకి వచ్చింది. అలాగే, టీ20 ఫార్మాట్ కు ప్రపంచ కప్ విజేత కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా ఉన్న హార్దిక్ పాండ్యా భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశముంది.

కాగా, టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ట్రోఫీ గెలిచిన త‌ర్వాత టీమిండియా స్టార్ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, ర‌వీంద్ర జ‌డేజాలు టీ20 క్రికెట్ కు వీడ్కోలు ప‌లికారు. అలాగే, రోహిత్, కోహ్లితో పాటు యూఎస్ఏ, వెస్టిండీస్‌లలో టీమిండియా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌లో కీల‌క పాత్ర పోషించిన మరో స్టార్ ప్లేయ‌ర్ జస్ప్రీత్ బుమ్రా కూడా శ్రీలంక పర్యటనకు విశ్రాంతి తీసుకున్నారు.సెప్టెంబరులో భారత హోమ్ సీజన్ ప్రారంభమయ్యే ముందు సీనియర్ ఆటగాళ్లకు బాగా విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. "రోహిత్ శ‌ర్మ విశ్రాంతి నేప‌థ్యంలో హార్దిక్, కేఎల్ రాహుల్ కు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. ఇద్దరూ ఇంతకుముందు జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు" అని బీసీసీఐ వ‌ర్గాలు చెబుతున్న‌ట్టు ప‌లు మీడియా నివేదిక‌లు పేర్కొంటున్నాయి.

IND vs ZIM : భార‌త్ గెలుపు.. శుభ్‌మ‌న్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. గైక్వాడ్ హాఫ్ సెంచ‌రీ మిస్

click me!