India vs Zimbabwe : జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా సూపర్ విక్టరీ అందుకుంది. 23 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించిన భారత్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.
India vs Zimbabwe: జింబాబ్వేతో సిరీస్‌పై టీమిండియా పట్టుసాధించింది. హరారేలో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో సూపర్ విక్టరీని అందుకుంది. 21 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని ఈ సిరీస్ లో 2-1 అధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్లు సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబేలు ఎంట్రీ ఇచ్చారు. టాస్ గెలిచిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే పోరాటం చేసింది కానీ విజయాన్నిఅందుకోలేకపోయింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ సిరీస్ లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా, తర్వాతి రెండు మ్యాచ్ లలో టీమిండియా విజయాన్ని అందుకుంది.
శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్
టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ కు దిగింది భారత్. జట్టులోకి వచ్చిన ఛాంపియన్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ తో కలిసి శుభ్ మన్ గిల్ టీమిండియా ఓపెనింగ్ ను ప్రారంభించారు. వీరిద్దరు జట్టుకు మంచి శుభారంభం అందించారు. ఈ క్రమంలోనే జైస్వాల్ 36 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఐపీఎల్ స్టార్, అంతకుముందు మ్యాచ్ లో సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయాడు. 10 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి గిల్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. 66 పరుగులు వద్ద ఔట్ కాగా, తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.
రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఇన్నింగ్స్..
కెప్టెన్ శుభ్ మన్ గిల్ తో కలిసి రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ వికెట్లు పడిన తర్వాత గిల్, రుతురాజ్ లు భారత్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో రుతురాజ్ సూపర్ షాట్స్ తో అదరగొట్టాడు. అద్భుతమైన షాట్స్ ఆడుతూ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 49 పరుగులు వద్ద ఔట్ అయ్యాడు. ఒక్క పరుగులు దూరంలో తన హాఫ్ సెంచరీని కోల్పోయాడు. రుతురాజ్ గైక్వాడ్ 28 బంతులు ఆడి 49 పరుగుల తన ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.
బౌలింగ్ లో మెరిసిన వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్
టార్గెట్ ఛేదనలో జింబాబ్వే ను భారత బౌలర్లు సూపర్ బౌలింగ్ తో అరంభం నుంచే వికెట్లు తీసుకున్నారు. రెండో ఓవర్ లోనే తొలి వికెట్ తీయడంతో మొదలు పెట్టి ఆ తర్వాత జింబాబ్వే ను పరుగులు చేయకుండా కట్టడి చేస్తూ వరుసగా వికెట్లు తీశారు. అయితే, డియోన్ మయర్స్ లు (65 పరుగులు), క్లైవ్ మదాండే (37 పరుగులు) కొద్ది సేపు భారత్ ను టెన్షన్ పెట్టారు కానీ, జింబాబ్వేకు విజయాన్ని అందించలేక పోయారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాను లు సూపర్ బౌలింగ్ తో జింబాబ్వేను దెబ్బకొట్టారు. వాషింగ్టన్ సుందర్ 3, అవేశ్ ఖాన్ 2, ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ చొప్పున తీసుకున్నారు.